5G Network: 5జీ కాల్‌ చేసిన మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

ఐఐటీ మద్రాసు వద్ద ఏర్పాటు చేసిన ప్రయోగాత్మక నెట్‌వర్క్‌పై తొలి 5జీ కాల్‌ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ చేశారు. దేశీయంగా అభివృద్ధి చేసిన టెలికాం గేర్‌లను ఉపయోగించి ఈ కాల్‌ చేయడం

Updated : 20 May 2022 10:24 IST

దిల్లీ: ఐఐటీ మద్రాసు వద్ద ఏర్పాటు చేసిన ప్రయోగాత్మక నెట్‌వర్క్‌పై తొలి 5జీ కాల్‌ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ చేశారు. దేశీయంగా అభివృద్ధి చేసిన టెలికాం గేర్‌లను ఉపయోగించి ఈ కాల్‌ చేయడం గమనార్హం. ‘ఆత్మనిర్భర్‌ 5జీ. ఐఐటీ మద్రాస్‌ వద్ద విజయవంతంగా 5జీ కాల్‌ను పరీక్షించాను. పూర్తిగా ఈ నెట్‌వర్క్‌ దేశీయంగా రూపొందించి, అభివృద్ధి చేసింద’ని వైష్ణవ్‌ తెలిపారు. ప్రస్తుత సంవత్సరం ఆగస్టు- సెప్టెంబరులో 5జీ నెట్‌వర్క్‌ సేవలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని