ఆకాశ ఎయిర్‌ కార్యకలాపాల ప్రారంభం మరింత ఆలస్యం

ఆకాశ ఎయిర్‌ కార్యకలాపాలు ప్రారంభం కావడం మరింత ఆలస్య్జయ్యే అవకాశం ఉందని డీజీసీఏ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. మొదటి విమానం జూన్‌ లేదా జులైలో తమకు సరఫరా

Published : 20 May 2022 02:49 IST

దిల్లీ: ఆకాశ ఎయిర్‌ కార్యకలాపాలు ప్రారంభం కావడం మరింత ఆలస్య్జయ్యే అవకాశం ఉందని డీజీసీఏ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. మొదటి విమానం జూన్‌ లేదా జులైలో తమకు సరఫరా అయ్యే అవకాశం ఉందని సంస్థ భావిస్తుండటమే ఇందుకు కారణంగా తెలిపారు. రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడులున్న ఆకాశ ఎయిర్‌ తొలుత జూన్‌లో కార్యకలాపాలు ప్రారంభించాలని భావించింది. ఆ తర్వాత దీనిని జులైకి వాయిదా వేసింది. ‘మొదటి విమానం సరఫరా ఆలస్యమవుతోంది. జూన్‌/ జులైలో సంస్థ చేతికి విమానం రావొచ్చు. ఇతర ప్రక్రియల విషయానికొస్తే అవి యథావిధిగా జరుగుతున్నాయ’ని డీజీసీఏ అధికారి తెలిపారు. అయితే జూన్‌ మధ్య కల్లా మొదటి విమానాన్ని పొందుతామని, జులైలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని ఆకాశ ఎయిర్‌ వ్యవస్థాపకుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వినయ్‌ దుబే వెల్లడించారు. 2023 చివరినాటికి 18 విమానాలను నడుపుతామని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని