రైట్‌ ఎంటైటిల్‌మెంట్స్‌ ట్రేడింగ్‌ ప్రక్రియ సులభతరం

రైట్స్‌ ఇష్యూకు సంబంధించి స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో రైట్‌ ఎంటైటిల్‌మెంట్స్‌ (ఆర్‌ఈ) ట్రేడింగ్‌ ముగింపు, రైట్స్‌ ఇష్యూ ముగింపునకు మధ్య సమయాన్ని తగ్గిస్తూ సెబీ నిర్ణయం తీసుకుంది. తద్వారా రైట్స్‌ ఇష్యూ

Published : 20 May 2022 02:48 IST

 సమయాన్ని 3 రోజులకు తగ్గించిన సెబీ

దిల్లీ: రైట్స్‌ ఇష్యూకు సంబంధించి స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో రైట్‌ ఎంటైటిల్‌మెంట్స్‌ (ఆర్‌ఈ) ట్రేడింగ్‌ ముగింపు, రైట్స్‌ ఇష్యూ ముగింపునకు మధ్య సమయాన్ని తగ్గిస్తూ సెబీ నిర్ణయం తీసుకుంది. తద్వారా రైట్స్‌ ఇష్యూ ప్రక్రియను సులభతరం చేసింది. దీని ప్రకారం.. స్టాక్‌ మార్కెట్‌లో ఆర్‌ఈల ట్రేడింగ్‌ రైట్స్‌ ఇష్యూతో పాటే మొదలై.. రైట్స్‌ ఇష్యూ ముగింపు తేదీకి కనీసం మూడురోజుల ముందు వాటి ట్రేడింగ్‌ ముగుస్తుందని సెబీ తెలిపింది. అంతకుముందు ఈ సమయం నాలుగు రోజులుగా ఉండేది. ఈక్విటీ షేర్ల మాదిరే టీ+2 (ట్రేడింగ్‌ రోజు నుంచి 2 రోజుల తర్వాత) సెటిల్‌మెంట్‌ విధానంతో ఆర్‌ఈలు స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడవుతుంటాయి. ఈ కొత్త విధానం అన్ని రైట్స్‌ ఇష్యూలకు తక్షణమే వర్తిస్తుందని సెబీ పేర్కొంది. మార్కెట్‌ వర్గాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను ఆధారంగా చేసుకుని, సెబీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని