ఎన్‌టీపీసీ లాభంలో 12 శాతం వృద్ధి

ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థ ఎన్‌టీపీసీ మార్చి త్రైమాసికానికి ఏకీకృత పద్ధతిలో రూ.5,199.51 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ.4,649.49 కోట్లతో పోలిస్తే ఇది

Published : 21 May 2022 02:36 IST

దిల్లీ: ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థ ఎన్‌టీపీసీ మార్చి త్రైమాసికానికి ఏకీకృత పద్ధతిలో రూ.5,199.51 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ.4,649.49 కోట్లతో పోలిస్తే ఇది 12 శాతం అధికం. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.31,687.24 కోట్ల నుంచి రూ.37,724.42 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తంమీద (2021-22) రూ.1,34,994.31 కోట్ల ఆదాయంపై  రూ.16,960.29 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 2020-21లో ఆదాయం రూ.1,15,546.83 కోట్లు కాగా, లాభం రూ.14,969.40 కోట్లు మాత్రమే. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ.3 తుది డివిడెండును కంపెనీ ప్రకటించింది. 2022 ఫిబ్రవరిలో చెల్లించిన రూ.4 మధ్యంతర డివిడెండుకు ఇది అదనం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని