Steel Prices: ఉక్కు ధరలు తగ్గుతాయ్
ఉక్కు తయారీకి వినియోగించే కోకింగ్ కోల్, ఫెర్రోనికెల్, పీసీఐ కోల్, కోక్, సెమీ కోక్ వంటి ముడి పదార్థాలపై కస్టమ్స్ సుంకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది.
దిల్లీ: ఉక్కు తయారీకి వినియోగించే కోకింగ్ కోల్, ఫెర్రోనికెల్, పీసీఐ కోల్, కోక్, సెమీ కోక్ వంటి ముడి పదార్థాలపై కస్టమ్స్ సుంకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఇందువల్ల దేశీయంగా ఉక్కు తయారీ వ్యయం తగ్గి, ధరలు అదుపులోకి వచ్చే అవకాశముంది. దీంతోపాటు దేశీయ పరిశ్రమలకు ఇనుప ఖనిజం అందుబాటులో ఉండేలా చూసేందుకు, వీటి ఎగుమతిపై సుంకాన్ని 30 శాతం నుంచి 50 శాతానికి పెంచారు. ఐరన్ పెల్లెట్ల ఎగుమతిపై 45 శాతం, మరికొన్ని స్టీల్ ఇంటర్మీడియరీస్పై 15 శాతం పెంచారు. నేటి నుంచే ఇవి అమల్లోకి రానున్నాయి.
ప్లాస్టిక్ పరిశ్రమకూ: ప్లాస్టిక్ తయారీ పరిశ్రమల్లో వినియోగించే ముడి పదార్థాల పైనా దిగుమతి సుంకాన్ని తగ్గించారు. నాఫ్తాపై 2.5 శాతం నుంచి 1 శాతానికి, ప్రొపిలీన్ ఆక్సైడ్‌పై 5 నుంచి 2.5 శాతానికి, పాలిమర్స్ ఆఫ్ వినైల్ క్లోరైడ్‌పై 10 నుంచి 7.5 శాతానికి తగ్గించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Kantara: ‘కాంతార 2’.. హీరోయిన్గా ఆమెను ఎంపిక చేస్తున్నారా?
-
Medicine Racket: నకిలీ ఔషధ రాకెట్ కేసులో ఈడీ ముమ్మర దాడులు
-
AAP: పదేళ్లలో దిల్లీకి ఏం చేశారు?.. భాజపా ఎంపీలకు ఆప్ ప్రశ్న!
-
BRS: ప్రవీణ్‌కుమార్‌ను భారాస ప్రధాన కార్యదర్శిగా నియమిస్తాం: కేసీఆర్
-
Yadagirigutta: యాదగిరిగుట్టలో వైభవంగా తిరు కల్యాణ మహోత్సవం
-
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్‌పై స్పందించిన అనుపమ