ఎల్‌ఎంఎల్‌ ఎలక్ట్రిక్‌ రూ.350 కోట్ల పెట్టుబడులు

కొత్త తయారీ ప్లాంట్‌ను నెలకొల్పడంతో పాటు వచ్చే ఏడాది 3 కొత్త ఉత్పత్తులను తీసుకొచ్చేందుకు రూ.350 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ఎల్‌ఎంఎల్‌ ఎలక్ట్రిక్‌ ప్రకటించింది. కాన్పూర్‌కు చెందిన లోహియా మోటార్స్‌ లిమిటెడ్‌ (ఎల్‌ఎంఎల్‌) గతంలో ఇటలీకి చెందిన పియాజియో, సి స్పాలతో కలిసి వెస్పా స్కూటర్లను తయారు చేసేది

Published : 23 May 2022 01:52 IST

ముంబయి: కొత్త తయారీ ప్లాంట్‌ను నెలకొల్పడంతో పాటు వచ్చే ఏడాది 3 కొత్త ఉత్పత్తులను తీసుకొచ్చేందుకు రూ.350 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ఎల్‌ఎంఎల్‌ ఎలక్ట్రిక్‌ ప్రకటించింది. కాన్పూర్‌కు చెందిన లోహియా మోటార్స్‌ లిమిటెడ్‌ (ఎల్‌ఎంఎల్‌) గతంలో ఇటలీకి చెందిన పియాజియో, సి స్పాలతో కలిసి వెస్పా స్కూటర్లను తయారు చేసేది. విద్యుత్‌ వాహనాలతో విపణిలోకి తిరిగి ప్రవేశిస్తామని గత ఏడాది సెప్టెంబరులో కంపెనీ ప్రకటించింది. హైపర్‌బైక్‌, ఇ-బైక్‌, ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను సెప్టెంబరు నాటికి ఆవిష్కరించి, వచ్చే ఏడాది ఫిబ్రవరి-ఆగస్టు మధ్యలో విపణిలోకి విడుదల చేస్తామని గత ఏప్రిల్‌లో ఎల్‌ఎంఎల్‌ పేర్కొంది. ‘తొలి విడతగా రూ.350 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నాం. దీంతో మా ఉత్పత్తుల్ని విస్తరిస్తాం. అలాగే కొత్త తయారీ ప్లాంట్‌ను నెలకొల్పుతామ’ని ఎల్‌ఎంఎల్‌ సీఈఓ యోగేశ్‌ భాటియా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని