ధనియాలు దిద్దుబాటు!

పసిడి జూన్‌ కాంట్రాక్టు ఈవారమూ సానుకూల ధోరణిలో కదలాడే అవకాశం ఉంది. అయితే రూ.50,380 స్థాయిపై ఓ కన్నేసి ఉంచాలి. ఈ స్థాయి కంటే కిందకు వస్తే దిద్దుబాటుకు ఆస్కారం ఉంటుంది. తక్కువ నష్టభయంతో ట్రేడ్‌ చేసే వాళ్లు రూ.49,564 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకొని

Published : 23 May 2022 02:08 IST

కమొడిటీస్‌
ఈ వారం
  బంగారం

పసిడి జూన్‌ కాంట్రాక్టు ఈవారమూ సానుకూల ధోరణిలో కదలాడే అవకాశం ఉంది. అయితే రూ.50,380 స్థాయిపై ఓ కన్నేసి ఉంచాలి. ఈ స్థాయి కంటే కిందకు వస్తే దిద్దుబాటుకు ఆస్కారం ఉంటుంది. తక్కువ నష్టభయంతో ట్రేడ్‌ చేసే వాళ్లు రూ.49,564 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకొని రూ.50,208- 49,991 దిగువన కొనుగోళ్లకు మొగ్గు చూపొచ్చు. అలాగే రూ.51,279 ఎగువన షార్ట్‌ సెల్‌ పొజిషన్లకు దూరంగా ఉండటం మంచిది.
* ఎంసీఎక్స్‌ బుల్‌డెక్స్‌ జూన్‌ కాంట్రాక్టు ఈవారం రూ.14,225 కంటే దిగువన కదలాడితే రూ.14,106; రూ.13,986 వరకు అమ్మకాల ఒత్తిడికి లోనుకావచ్చు. అయితే ఈవారం రూ.14,598 వరకు కాంట్రాక్టుకు సానుకూలత కనిపిస్తోంది. అందువల్ల లాంగ్‌ పొజిషన్లున్న ట్రేడర్లు స్టాప్‌లాస్‌ను సవరించుకొని వాటిని కొనసాగించడం మంచిదే.


వెండి

వెండి జులై కాంట్రాక్టు కిందకు వస్తే రూ.60,360 వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ స్థాయినీ కోల్పోతే రూ.59,814, ఆ తర్వాత రూ.59,011 వరకు దిగివస్తుందని భావించవచ్చు. ఒకవేళ పైకి వెళితే రూ.62513 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. దీనినీ అధిగమిస్తే రూ.63,059; రూ.63,605 వరకు పెరిగే అవకాశం ఉంటుంది.


ప్రాథమిక లోహాలు

* రాగి జూన్‌ కాంట్రాక్టు ఈవారం రూ.739 దిగువన ట్రేడయితే ప్రతికూల ధోరణి కొనసాగుతుందని భావించవచ్చు. రష్యా- ఉక్రెయిన్‌ పరిణామాల ప్రభావంతో ఒడుదొడుకులు కొనసాగొచ్చు. అలాగే రూ.775 ఎగువన కొనుగోళ్లకు మొగ్గు చూపడమూ మంచిదే.
* సీసం జూన్‌ కాంట్రాక్టు ఈవారం రూ.179.35 కంటే దిగువన ట్రేడయితే మరింతగా పడిపోయే అవకాశం ఉంది.
*జింక్‌ జూన్‌ కాంట్రాక్టుకు ఈవారం రూ.322 వరకు సానుకూల ధోరణి కొనసాగే అవకాశం ఉంది. అందువల్ల రూ.311 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకొని కొత్తగా లాంగ్‌ పొజిషన్లు తీసుకోవచ్చు.
*అల్యూమినియం జూన్‌ కాంట్రాక్టుకు ఈవారం రూ.252; రూ.259 లక్ష్యాలతో ధర తగ్గినప్పుడల్లా లాంగ్‌ పొజిషన్లు జత చేసుకోవచ్చు. అలాగే రూ.241.50 దిగువన షార్ట్‌ సెల్‌ చేయడం మంచిదే.


ఇంధన రంగం

* ముడి చమురు జూన్‌ కాంట్రాక్టు ఈవారం రూ.9,016 కంటే పైన చలించకుంటే రూ.8,411; రూ.8,228 వరకు దిద్దుబాటు అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ రూ.8,804 కంటే పైన కదలాడితే రూ.9,016; రూ.9,381  వరకు పెరుగుతుందని భావించవచ్చు.
* సహజవాయువు జూన్‌ కాంట్రాక్టును ఈవారం రూ.685 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకొని రూ.658- 678 దిగువన షార్ట్‌ సెల్‌ చేయడం మంచిదే.


 వ్యవసాయ ఉత్పత్తులు

* పసుపు జూన్‌ కాంట్రాక్టు ఈవారం రూ.7,952 కంటే దిగువన ట్రేడ్‌ కాకుంటే కొనుగోళ్లకు మొగ్గు చూపొచ్చు. ఒకవేళ ఈ స్థాయి కంటే దిగువన ట్రేడయితే రూ.7,705 స్థాయికి పడిపోయే అవకాశం ఉంది.
* జీలకర్ర జూన్‌ కాంట్రాక్టు ఈ వారం రూ.21,365 దిగువన ట్రేడయితే మరింతగా పడిపోవచ్చు. ఒకవేళ రూ.22,416 కంటే పైన చలిస్తే మరింత రాణించేందుకు అవకాశమూ ఉంది.
* ధనియాలు జూన్‌ కాంట్రాక్టు ఈవారం రూ.11,506 కంటే దిగువన చలిస్తే మరింతగా దిద్దుబాటు అయ్యేందుకు అవకాశం ఉంది.

- ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని