ఆ రాన్సమ్‌వేర్‌ బారిన పడితే పేదలకు సాయం చేయాల్సిందే..

భారత్‌లో ఓ కొత్త రాన్సమ్‌వేర్‌ను డిజిటల్‌ రిస్క్‌ మానిటరింగ్‌ సంస్థ క్లౌడ్‌సెక్‌ గుర్తించింది. ఈ రాన్సమ్‌వేర్‌ బారిన పడిన బాధితులు.. నిరాశ్రయులైన వారికి కొత్త బట్టలు విరాళంగా ఇవ్వడం, బ్రాండెడ్‌ పిజ్జా విక్రయ కేంద్రాల్లో పిల్లలకు ఆహారం అందివ్వడం, అత్యవసర వైద్య సాయం

Published : 23 May 2022 02:24 IST

క్లౌడ్‌సెక్‌ పరిశోధనలో వెల్లడి

దిల్లీ: భారత్‌లో ఓ కొత్త రాన్సమ్‌వేర్‌ను డిజిటల్‌ రిస్క్‌ మానిటరింగ్‌ సంస్థ క్లౌడ్‌సెక్‌ గుర్తించింది. ఈ రాన్సమ్‌వేర్‌ బారిన పడిన బాధితులు.. నిరాశ్రయులైన వారికి కొత్త బట్టలు విరాళంగా ఇవ్వడం, బ్రాండెడ్‌ పిజ్జా విక్రయ కేంద్రాల్లో పిల్లలకు ఆహారం అందివ్వడం, అత్యవసర వైద్య సాయం అవసరమైన వారికి ఆర్థిక సహాయం అందించడం వంటివి చేయాలని సదరు రాన్సమ్‌వేర్‌ ఆపరేటర్లు సూచిస్తున్నట్లు క్లౌడ్‌సెక్‌ తెలిపింది. తమ రీసెర్చర్లు 2022 మార్చిలో గుడ్‌విల్‌ రాన్సమ్‌వేర్‌ను గుర్తించారని, సంప్రదాయ ఆర్థిక కారణాల కంటే సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడంలో ఈ రాన్సమ్‌వేర్‌ ఆపరేటర్లు ఆసక్తి చూపుతున్నారనే విషయం పరిశోధనలో తేలిందని క్లౌడ్‌సెక్‌ పేర్కొంది. ఈ రాన్సమ్‌వేర్‌ పత్రాలు, ఫొటోలు, వీడియోలు, డేటాబేస్‌, ఇతర ముఖ్యమైన ఫైల్స్‌ను డీక్రిప్షన్‌ కీ లేకుండా యాక్సెస్‌ చేయలేని స్థితికి మారుస్తోందని తెలిపింది. బాధితులు ఈ కీ పొందేందుకు నిరాశ్రయులకు కొత్త బట్టలు విరాళాలు ఇవ్వడంతో పాటు దాన్ని రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయాల్సి ఉంటుంది. పిజ్జా కేంద్రాలకు ఐదుగురు పిల్లలకు తగ్గకుండా తీసుకెళ్లి వారికి పిజ్జాలు తినిపించి వాటి ఫొటోలు, వీడియోలు కూడా షేర్‌ చేయాలి. అలాగే వైద్య సాయం అవసరమైన వారికి దగ్గర్లోని ఆసుపత్రుల్లో చికిత్స చేయించి ఆడియో రికార్డు చేసి దాన్ని ఆపరేట్లరకు పంపాల్సి ఉంటుంది. ఈ మూడు పనులు పూర్తి చేసిన బాధితులు ‘రాన్సమ్‌వేర్‌ బాధితులైన తర్వాత తాము ఎలా దయ గల మనుషులుగా మారామో’ ఫేస్‌బుక్‌ లేదా ఇన్‌స్టాలో రాయాలి. ఇవన్నీ పూర్తి చేస్తే రాన్సమ్‌వేర్‌ ఆపరేటర్లు పరిశీలించి డీక్రిప్షన్‌ కిట్‌ను పాస్‌వర్డ్‌ ఫైల్‌తో పాటు వీడియో ట్యుటోరియల్‌తో పంపి ముఖ్యమైన ఫైల్స్‌ను ఎలా రికవరీ చేసుకోవాలో సూచిస్తారని క్లౌడ్‌సెక్‌ వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని