స్పైస్‌జెట్‌ విమానాల్లో త్వరలో ఇంటర్నెట్‌ సేవలు

త్వరలోనే తమ విమానాల్లో బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సేవలను ప్రారంభించనున్నట్లు స్పైస్‌జెట్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) అజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు.

Published : 24 May 2022 07:42 IST

మరిన్ని బోయింగ్‌ 737 మాక్స్‌ విమానాలు: సీఎండీ

దిల్లీ: త్వరలోనే తమ విమానాల్లో బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సేవలను ప్రారంభించనున్నట్లు స్పైస్‌జెట్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) అజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు. కంపెనీకి 91 విమానాలుండగా.. అందులో బోయింగ్‌ 737 మాక్స్‌ విమానాలు 13; బోయింగ్‌ 737 (పాత వర్షన్‌) విమానాలు 46 ఉన్నాయని కంపెనీ వెబ్‌సైట్‌ చెబుతోంది. కొద్ది నెలల్లో మరిన్ని బోయింగ్‌ 737 మాక్స్‌ విమానాలను జత చేసుకుంటామని, కంపెనీ 17వ వార్షికోత్సవం సందర్భంగా ఉద్యోగులకు రాసిన లేఖలో అజయ్‌సింగ్‌ తెలిపారు. ‘ప్రయాణికుల నుంచి మెరుగైన రివ్యూలను పొందిన మాక్స్‌ మోడళ్లతో పాత విమానాలను భర్తీ చేయడమే లక్ష్యమ’ని సింగ్‌ తెలిపారు. ‘ఈ ఏడాది కొత్త ఉత్పత్తులు, కొత్త మార్గాలను జత చేయడం కొనసాగిస్తాం. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడూ ఇంటర్నెట్‌ వినియోగించుకునే సేవలను మొదలుపెట్టగలమని ఆశిస్తున్నామ’న్నారు. ‘కరోనా సంక్షోభ సమయంలో లక్షకు పైగా ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను భారత్‌కు రవాణా చేశాం. కరోనా టీకాల రవాణాలో తొలి, అతిపెద్ద రవాణాదారుగా నిలిచామ’ని ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు