Published : 24 May 2022 02:55 IST

జులై నుంచి ఆకాశ ఎయిర్‌ సేవలు

దిల్లీ: ప్రముఖ మదుపరి రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా, జెట్‌ ఎయిర్‌వేస్‌ మాజీ సీఈఓ వినయ్‌ దూబే, ఇండిగో మాజీ ప్రెసిడెంట్‌ ఆదిత్య ఘోష్‌ల నేతృత్వంలోని కొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌ ఈ ఏడాది జులైలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించనుంది. తమ తొలి బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాన్ని జూన్‌ మధ్యలో అందుకుంటామని, జులైలో సేవలు ప్రారంభమవుతాయని సంస్థ తెలిపింది. అమెరికా పోర్ట్‌ల్యాండ్‌లోని బోయింగ్‌ ప్లాంట్‌లో సిద్ధంగా ఉన్న తమ తొలి మ్యాక్స్‌ విమానం ఫొటోను సంస్థ సోమవారం విడుదల చేసింది. 2023 మార్చి ఆఖరుకు 18 విమానాలను దేశీయ మార్గాల్లో నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆకాశ ఎయిర్‌ తెలిపింది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలపైనా దృష్టి పెడుతున్నట్లు వివరించింది. ఆకాశ ఎయిర్‌కు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి 2021 ఆగస్టులోనే నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్‌ఓసీ) లభించింది. పౌర విమానయాన డైరెక్టర్‌ జనరల్‌ బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలను నడుపుకునేందుకు పచ్చజెండా ఊపడంతో, 2021 నవంబరు 26న బోయింగ్‌తో ఆకాశ ఎయిర్‌ 72 విమానాల కొనుగోలు ఒప్పందాన్ని చేసుకుంది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని