Published : 24 May 2022 02:54 IST

81 శాతం పెరిగిన దివీస్‌ లాభం

రూ.30 డివిడెండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: దివీస్‌ లేబొరేటరీస్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ.2,546 కోట్ల ఆదాయాన్ని, రూ.883 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2020-21 ఇదేకాలంలో ఆదాయం రూ.1,741 కోట్లు, నికరలాభం రూ.488 కోట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో పోల్చితే ఈసారి ఆదాయం 46 శాతం, నికరలాభం 81 శాతం పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం (2021-22) పూర్తికాలానికి దివీస్‌ లేబొరేటరీస్‌ మొత్తం ఆదాయం రూ.8,991 కోట్లు, నికరలాభం రూ.2,949 కోట్లుగా ఉన్నాయి. 2020-21లో మొత్తం ఆదాయం రూ.6,861 కోట్లు, నికరలాభం రూ.1,955 కోట్లు మాత్రమే. దీంతో పోల్చితే వార్షికాదాయం 31 శాతం, నికరలాభం 51 శాతం పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో విదేశీ మారకద్రవ్య మిగులు రూ. 38 కోట్ల మేరకు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. వాటాదార్లకు రూ.2 ముఖ విలువ కల ఒక్కో షేరుపై రూ.30 చొప్పున డివిడెండ్‌ చెల్లించాలని దివీస్‌ యాజమాన్యం ప్రతిపాదించింది.

10 శాతం క్షీణించిన షేరు ధర!: ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించినా దివీస్‌ షేరు ధర సోమవారం దాదాపు 10 శాతం నష్టపోయింది. బీఎస్‌ఈలో శుక్రవారం ముగింపు ధర రూ.4,306 కాగా, సోమవారం రూ.4,301 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమై, గరిష్ఠంగా రూ.4,438కు చేరింది. ఆ తర్వాత రూ.3,875కు పతనమైనా, చివరికి రూ.3,897 వద్ద ముగిసింది. తుది వస్తువుల నిల్వ (ఫినిష్డ్‌ గూడ్స్‌ ఇన్వెంటరీ) రూ.500 కోట్లకు పెరగడం, ముడి పదార్థాల ఖర్చు, ఇతర వ్యయాలు అధికంగా ఉండటమే దీనికి ప్రధాన కారణంగా మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. స్టాక్‌మార్కెట్లో ‘సెంటిమెంట్‌’ బలహీనంగా ఉండటమూ దోహదపడి ఉంటుందని పేర్కొంటున్నాయి.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని