హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కార్పొరేట్ ఎడిషన్
హ్యుందాయ్ తన గ్రాండ్ ఐ10 నియోస్ మోడల్లో కార్పొరేట్ ఎడిషన్‌ను సోమవారం విడుదల చేసింది. ప్రారంభ ధర రూ.6.28 లక్షలు (ఎక్స్ షోరూం). 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన ఈ మోడల్ మ్యాన్యువల్, ఆటోమేటిక్
ధర రూ.6.27 లక్షల నుంచి
దిల్లీ: హ్యుందాయ్ తన గ్రాండ్ ఐ10 నియోస్ మోడల్లో కార్పొరేట్ ఎడిషన్‌ను సోమవారం విడుదల చేసింది. ప్రారంభ ధర రూ.6.28 లక్షలు (ఎక్స్ షోరూం). 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన ఈ మోడల్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ పవర్‌ట్రెయిన్స్ రకాల్లో లభ్యం కానుంది. ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ వేరియంట్ ధర రూ.6.28 లక్షలు కాగా.. ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్‌కు రూ.6.97 లక్షలుగా ధరను నిర్ణయించారు. నలుపు రంగు ఇంటీరియర్స్, ఎరుపు రంగు ఇన్సర్ట్స్తో (సీట్లు, ఏసీ వెంట్స్, గేర్ బూట్) కార్పొరేట్ ఎడిషన్‌ను హ్యుందాయ్ అందుబాటులోకి తెచ్చింది. 17.4 సెంటీమీటర్ల తాకే తెర ఇన్ఫోటెయిన్మెంట్, స్మార్ట్‌ఫోన్ మిర్రరింగ్ ద్వారా నేవిగేషన్, బయటి అద్దంపై ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్ లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్‌గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు