దేశీయంగా విశ్వసనీయతలో భారత కంపెనీలే మేటి

దేశీయ ప్రజల నుంచి అత్యంత విశ్వసనీయతను చూరగొన్న విషయంలో భారతీయ కంపెనీలు అగ్రస్థానం పొందాయి. ఆ తర్వాతి స్థానాల్లో చైనా, కెనడా, అమెరికా, బ్రిటన్‌ కంపెనీలు ఉన్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది. వ్యాపారాలపై విశ్వాసానికి

Published : 25 May 2022 04:04 IST

ఆ తర్వాతి స్థానాల్లో చైనా, కెనడా, యూఎస్‌, బ్రిటన్‌: సర్వే

దావోస్‌: దేశీయ ప్రజల నుంచి అత్యంత విశ్వసనీయతను చూరగొన్న విషయంలో భారతీయ కంపెనీలు అగ్రస్థానం పొందాయి. ఆ తర్వాతి స్థానాల్లో చైనా, కెనడా, అమెరికా, బ్రిటన్‌ కంపెనీలు ఉన్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది. వ్యాపారాలపై విశ్వాసానికి భౌగోళిక రాజకీయ పరిణామాలు ప్రస్తుతం పరీక్షగా మారాయని తెలిపింది. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశంలో భాగంగా ఎడెల్మన్‌ ట్రస్ట్‌ బారోమీటర్‌ స్పెషల్‌ రిపోర్ట్‌ను విడుదల చేశారు. భౌగోళిక రాజకీయ పరిణామాలు ప్రస్తుతం వ్యాపారానికి ఓ ప్రాధాన్యాంశమని పది మందిలో ఆరుగురు అభిప్రాయపడినట్లు నివేదిక తెలిపింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితులు, వాతావరణ ముప్పు, సామాజిక అసమానతలు లాంటివి ప్రపంచానికి సవాళ్లు విసురుతున్న ఈ తరుణంలో రష్యా- ఉక్రెయిన్‌ పరిణామాలపైనా స్పందించాలన్న ఒత్తిడి కంపెనీలపై నెలకొందని వివరించింది. పలు కంపెనీలు రష్యాలో వ్యాపారాలు నిలిపి వేసిన సంగతి విదితమే. నివేదికలో మరిన్ని వివరాలు ఇలా..

ఉక్రెయిన్‌పై దాడికి స్పందనగా మాతృ కంపెనీ తీసుకున్న నిర్ణయం అనుసరించి బ్రాండ్‌లను కొనడం లేదా వాటిని ఉపయోగించకపోవడం చేశామని 47 శాతం మంది తెలిపారు.

ఉక్రెయిన్‌పై దాడికి స్పందనగా తమ కంపెనీలు సరైనదే చేస్తున్నట్లు అనిపిస్తే మరింత విధేయులం అయ్యామని 79 శాతం మంది వెల్లడించారు. ఇతరులకు కూడా కంపెనీ గురించి సిఫారసు చేశామని 80 శాతం మంది తెలిపారు.

దేశీయంగా విశ్వసనీయతలో భారత్‌ 89 శాతంతో (జనవరితో పోలిస్తే 4% పెరుగుదల) మొదటి స్థానంలో ఉండగా.. 82 శాతంతో చైనా ద్వితీయ స్థానంలో ఉంది. కెనడా, అమెరికా, బ్రిటన్‌లు 70- 76 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వం, మీడియాపై విశ్వసనీయతను పరిగణనలోకి తీసుకునే ట్రస్ట్‌ ఇండెక్స్‌లో భారత్‌ ప్రస్తుతం రెండో స్థానంలో ఉండగా.. చైనాది మొదటి స్థానం. జనవరిలో భారత్‌ మూడో స్థానంలో ఉండటం గమనార్హం.

అత్యంత విశ్వసనీయత వర్గంగా శాస్త్రవేత్తలు మొదటి స్థానం పొందారు. అత్యంత విశ్వసనీయ సంస్థగా ఐక్యరాజ్యసమితి నిలిచింది.

ఏప్రిల్‌- జూన్‌ మధ్య 14 దేశాల్లోని 14,000 మందిపై ఈ సర్వేను నిర్వహించి నివేదికను రూపొందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని