
డిజిటల్ సాంకేతికతతో 20% ఉద్గారాల తగ్గింపు
డబ్ల్యూఈఎఫ్ పరిశోధన
దావోస్: కాలుష్య ఉద్గారాలు అధికంగా వెదజల్లే ఇంధన, మొబిలిటీ, మెటీరియల్స్ రంగాల్లో డిజిటల్ సాంకేతికతల వినియోగం వల్ల 2050 కల్లా 20 శాతం వరకు ఉద్గారాలు తగ్గుతాయని ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) అంచనా వేసింది. పర్యావరణ మార్పులకు అడ్డుకట్టవేసేందుకు ప్రపంచం ఇచ్చిన పిలుపునకు కంపెనీలు, ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి. అయితే చేపడుతున్న, చేపట్టాల్సిన చర్యల మధ్య భారీ అంతరం కనిపిస్తోందని అసెంచర్‌తో కలిసి నిర్వహించిన కొత్త సర్వేలో తేలిందని డబ్ల్యూఈఎఫ్ వివరించింది. ప్రస్తుతం చేపడుతున్న చర్యల కారణంగా 7.5 శాతం మేర ఉద్గారాలు తగ్గొచ్చు. 55 శాతం వరకు వీటిని తగ్గించాల్సిన అవసరం ఉంది. ఈ అంతరాన్ని తగ్గించాలంటే అధిక ఉద్గార రంగాలు పునరాలోచించాల్సిన అవసరం ఉంది.
ఈ నాలుగు సాంకేతికతలతో..
2020లో వెలువడిన మొత్తం కర్బన ఉద్గారాల్లో ఇంధన, మెటీరియల్స్, మొబిలిటీ రంగాలు వరుసగా 43%, 26%, 24 శాతం మేర వాటా కలిగి ఉన్నాయి. ఈ పరిశ్రమలు నాలుగు డిజిటల్ సాంకేతికతలను వినియోగించి తమ కార్యకలాపాలు, ఇతర వ్యవస్థల్లో కర్బన స్థాయిని తగ్గించొచ్చు. ఫౌండేషనల్ సాంకేతికతలైన బిగ్ డేటా అనలిటిక్స్; డెసిషన్ మేకింగ్ సాంకేతికతలైన కృత్రిమ మేధ/మెషీన్ లెర్నింగ్; ఎనేబ్లింగ్ టెక్నాలజీస్ అయిన క్లౌడ్, 5జీ, బ్లాక్‌చెయిన్, ఆగుమెంటెడ్ రియాల్టీ; సెన్సింగ్, కంట్రోల్ సాంకేతికతలైన ఐఓటీ, డ్రోన్లు, ఆటోమేషన్‌లను వీటిలో వినియోగించవచ్చని డబ్ల్యూఈఎఫ్ వివరించింది.
ఏ రంగంలో ఎలాగంటే..
* డిజిటల్ సొల్యూషన్ల ద్వారా ఇంధన రంగంలో 8 శాతం ఉద్గారాలను తగ్గించవచ్చు. ఇందుకోసం భవనాల్లో ఇంధన సామర్థ్యం మెరుగుపరచాలి. పునరుత్పాదక విద్యుత్‌ను నిర్వహించాలి.
* మెటీరియల్స్ విభాగంలో గనులు, అప్‌స్ట్రీమ్ ఉత్పత్తిని డిజిటల్ సొల్యూషన్ల ద్వారా మెరుగుపరచవచ్చు. 2050 కల్లా 7 శాతం మేర ఉద్గారాలను తగ్గించవచ్చు.
* మొబిలిటీ రంగంలో 5% మేర ఉద్గారాలను తగ్గించొచ్చు. సంప్రదాయ ఇంధన ఇంజిన్ల నుంచి హరిత ఇంధనానికి మారడానికి ప్రయత్నించడం ద్వారా దీనిని సాధించొచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Pakistan: పాక్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. 19 మంది మృతి
-
India News
Kerala: సీఎం పినరయ్ విజయన్ను తుపాకీతో కాలుస్తా: మాజీ ఎమ్మెల్యే భార్య హెచ్చరిక
-
Crime News
దారుణం.. మైనర్లయిన అక్కాచెల్లెలిపై గ్యాంగ్ రేప్: ఐదుగురు యువకులు అరెస్టు!
-
Sports News
Virat Kohli: బెయిర్‌స్టో క్యాచ్ పట్టాక.. కోహ్లీ ఫ్లయింగ్ కిస్ వీడియో..!
-
Business News
Maruti Alto K10: మళ్లీ రానున్న మారుతీ ఆల్టో కే10?
-
Movies News
Ante Sundaraniki: డేట్ సేవ్ చేసుకోండి.. ‘అంటే.. సుందరానికీ!’.. ఆరోజే ఓటీటీలోకి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య
- IND vs ENG: పుజారా అర్ధశతకం.. మూడో రోజు ముగిసిన ఆట
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- Virat Kohli: బెయిర్‌స్టో క్యాచ్ పట్టాక.. కోహ్లీ ఫ్లయింగ్ కిస్ వీడియో..!
- Viral tweet: ‘క్యాబ్‌లో నేను ఇంటికి వెళ్లే ఖర్చుతో విమానంలో గోవా వెళ్లొచ్చు!’
- Rishabh Pant: వికెట్ కీపర్లలో పంత్.. బ్రియాన్ లారా: పాక్ మాజీ కెప్టెన్
- బిగించారు..ముగిస్తారా..?
- Ante Sundaraniki: డేట్ సేవ్ చేసుకోండి.. ‘అంటే.. సుందరానికీ!’.. ఆరోజే ఓటీటీలోకి
- Anand Mahindra: హర్ష గొయెంకా ‘గ్రేట్ మెసేజ్’కు.. ఆనంద్ మహీంద్రా రియాక్ట్!
- Narendra Modi: డబుల్ ఇంజిన్ వస్తోంది