విమానాల్లో సీట్లు సరిగా లేకపోవడంపై డీజీసీఏ ఆగ్రహం

దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో అనువుగా లేని (అన్‌సర్వీసబుల్‌) సీట్లను సైతం ప్రయాణికులకు కేటాయిస్తున్నాయంటూ, విమానయాన సంస్థలపై పౌర విమానయాన డైరెక్టర్‌ జనరల్‌ (డీజీసీఏ)

Published : 25 May 2022 04:08 IST

దిల్లీ: దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో అనువుగా లేని (అన్‌సర్వీసబుల్‌) సీట్లను సైతం ప్రయాణికులకు కేటాయిస్తున్నాయంటూ, విమానయాన సంస్థలపై పౌర విమానయాన డైరెక్టర్‌ జనరల్‌ (డీజీసీఏ) మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. విమానాల్లోని సీట్లు, ఇతర క్యాబిన్‌ ఫిట్టింగ్‌ల ఆడిట్‌ను ఈ ఏడాది ప్రారంభంలో డీజీసీఏ నిర్వహించింది. కొన్ని సీట్లు విరిగి, ప్రయాణించేందుకు అనువుగా లేవని గుర్తించింది. అయినా ఆయా సంస్థలు తమ దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో ఆ సీట్లనూ ప్రయాణికులకు కేటాయిస్తున్నాయని తమ దృష్టికి వచ్చిందని డీజీసీఏ పేర్కొంది. ఇందువల్ల ప్రయాణికులకు అసౌకర్యం కలగడమే కాకుండా ప్రయాణ భద్రతకూ ముప్పు కలిగిస్తుందని డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై మంచి సీట్లను మాత్రమే ప్రయాణికులకు కేటాయించాలని, ఒకవేళ ఏ సంస్థ అయినా దీన్ని అతిక్రమిస్తే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని