గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ లాభం రూ.4,070 కోట్లు

ఆదిత్యా బిర్లా గ్రూప్‌ సంస్థ గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ మార్చి త్రైమాసికంలో రూ.4,070.46 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే త్రైమాసికంలో సంస్థ నికర లాభం రూ.2,616.64 కోట్లతో పోలిస్తే ఇది 55.56 శాతం అధికం. ఇదే సమయంలో

Published : 25 May 2022 04:11 IST

దిల్లీ: ఆదిత్యా బిర్లా గ్రూప్‌ సంస్థ గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ మార్చి త్రైమాసికంలో రూ.4,070.46 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే త్రైమాసికంలో సంస్థ నికర లాభం రూ.2,616.64 కోట్లతో పోలిస్తే ఇది 55.56 శాతం అధికం. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.24,401.45 కోట్ల నుంచి 18.07 శాతం పెరిగి రూ.28,811.39 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు రూ.20,887.16 కోట్ల నుంచి 23.45 శాతం పెరిగి రూ.25,786.54 కోట్లకు చేరాయి. 2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గ్రాసిమ్‌ ఏకీకృత నికర లాభం రూ.11,206.29 కోట్లకు చేరింది. 2020-21లో ఆర్జించిన నికర లాభం రూ.6,986.70 కోట్లతో పోలిస్తే ఇది 60.39 శాతం అధికం. విక్రయాలు రూ.76,404.29 కోట్ల నుంచి 25.25 శాతం పెరిగి రూ.95,701.13 కోట్లకు చేరాయి.
రంగుల వ్యాపారంపై రూ.10,000 కోట్ల పెట్టుబడులు: రంగుల వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు వీలుగా మూలధన పెట్టుబడుల్ని రెట్టింపు చేసి రూ.10,000 కోట్లకు చేర్చినట్లు గ్రాసిమ్‌ వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం నుంచి రంగుల ఉత్పత్తి ప్రారంభించే అవకాశాలున్నాయని పేర్కొంది. రూ.5,000 కోట్లతో రంగుల వ్యాపారం ఏర్పాటు చేయాలనే ప్రణాళికకు గత ఏడాది ఆగస్టులో బోర్డు ఆమోదం తెలిపింది. అయితే విపణిలో వచ్చిన మార్పుల నేపథ్యంలో పెట్టుబడి అంచనాను రూ.10,000 కోట్లకు పెంచినట్లు కంపెనీ వెల్లడించింది.

రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.5 డివిడెండ్‌తో పాటు మరో రూ.5 ప్రత్యేక డివిడెండ్‌ను (మొత్తం రూ.10) చెల్లించేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.

బీఎస్‌ఈలో షేరు 3.72 శాతం తగ్గి రూ.1,402.65 వద్ద ముగిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని