
ఇళ్ల ధరలు పెరిగాయ్
8 నగరాల్లో 11 శాతం దాకా ప్రియం
జనవరి-మార్చిపై క్రెడాయ్ సంయుక్త నివేదిక
దిల్లీ: ఇళ్లు, ఫ్లాట్ల ధరలు మరింత పెరిగాయి. గిరాకీకి తోడు నిర్మాణ ముడి పదార్థాల ధరలు పెరగడం ఇందుకు కారణమని క్రెడాయ్, కాలియర్స్, లియాసెస్ ఫోరాస్ సంయుక్త నివేదిక ఒకటి పేర్కొంది. 2021 జనవరి-మార్చితో పోలిస్తే ఈ ఏడాది ఇదే సమయంలో ఇళ్ల ధరలు గరిష్ఠంగా 11 శాతం వరకు ప్రియమైనట్లు తెలిపింది. ఈ నివేదిక ప్రకారం..
* దిల్లీ-ఎన్సీఆర్లో 11 శాతం పెరిగి చదరపు అడుగు ధర రూ.7,363కు చేరింది.
* హైదరాబాద్‌లో 9 శాతం వరకు పెరిగి కొన్ని ప్రాంతాల్లో చ.అ. రూ.9,232 పలుకుతోంది. అహ్మదాబాద్‌లో 8% హెచ్చి రూ.5,721; కోల్‌కతాలో 6% పెరిగి రూ.6,245కు; పుణెలో 3% ప్రియమై రూ.7,485కు చ.అ. ధర చేరింది.
* బెంగళూరు, చెన్నై, ముంబయి మెట్రోపొలిటన్ ప్రాంతం(ఎమ్ఎమ్ఆర్)లలో చదరపు అడుగు 1 శాతం మేర పెరిగి వరుసగా రూ.7,595; రూ.7,107; రూ.19,557కు చేరాయి.
* దేశం మొత్తం నివాసాల ధరలు సగటున 4% పెరిగాయి. నిర్మాణ వ్యయాల వల్ల వచ్చే 6-9 నెలల్లో ఇళ్ల ధరలు మరో 5-10 శాతం పెరగొచ్చని కాలియర్స్ ఇండియా సీఈఓ రమేశ్ నాయర్ పేర్కొన్నారు.
* 2022 జనవరి-మార్చిలో కొత్త ప్రాజెక్టులు కరోనా ముందు స్థాయికి చేరాయి. రాబోయే త్రైమాసికాల్లో మరిన్ని పెరగొచ్చు. ఇటీవలి కాలంలో వడ్డీ రేట్లు పెరిగినా.. విక్రయాలు కొనసాగొచ్చు. ఉక్కు ఉత్పత్తుల ధరలు తగ్గి..నిర్మాణ ప్రాజెక్టుల వ్యయాలు అదుపులోకి రావచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Driver Jamuna: ‘డ్రైవర్ జమున’గా ఐశ్వర్య రాజేశ్.. ఉత్కంఠ భరితంగా ట్రైలర్
-
Sports News
ధోనీ బర్త్‌డే స్పెషల్..41 అడుగుల కటౌట్
-
General News
Hyderabad: కన్నులపండువగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Crime News
ED: రుణయాప్‌ల కేసుల్లో దూకుడు పెంచిన ఈడీ.. రూ.86.65 కోట్ల జప్తు
-
India News
Rajya Sabha: రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్రప్రసాద్.. మోదీ కంగ్రాట్స్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra News: మేకప్ వేసి.. మోసం చేసి.. ముగ్గురిని వివాహమాడి..
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Online Food delivery: ఆన్లైన్ Vs ఆఫ్‌లైన్: ఫుడ్ డెలివరీ దోపిడీని బయటపెట్టిన యూజర్.. పోస్ట్ వైరల్!
- Gas Cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
- Bhagwant Mann: రెండో వివాహం చేసుకోబోతోన్న సీఎం భగవంత్ మాన్!
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
- Paid trip to employees: ఉద్యోగులందరికీ 2 వారాల ట్రిప్.. ఖర్చులన్నీ కంపెనీవే!
- Health : పొంచి ఉన్న ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు!
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?