Published : 26 May 2022 05:43 IST

46% పెరిగిన కోల్‌ ఇండియా లాభం

దిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ కోల్‌ ఇండియా గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.6,692.94 కోట్ల ఏకీకృత లాభాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాల లాభం రూ.4,586.78 కోట్లతో పోలిస్తే ఇది 45.9 శాతం ఎక్కువ. ఇదే సమయంలో కార్యకలాపాల ఏకీకృత ఆదాయం రూ.26,700.14 కోట్ల నుంచి రూ.32,706.77 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ.21,515.60 కోట్ల నుంచి రూ.25,161.20 కోట్లకు చేరాయి. బొగ్గు ఉత్పత్తి  203.42 మిలియన్‌ టన్నుల నుంచి 209 మి.టన్నులకు చేరింది. విక్రయాలు రూ.164.89 మి.టన్నుల నుంచి   180.25 మి.టన్నులకు పెరిగాయి. 2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఉత్పత్తి 622.63 మి.టన్నులకు చేరింది. 2020-21లో ఇది 596.22 మి.టన్నులుగా ఉంది. రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.3 చొప్పున తుది డివిడెండ్‌ చెల్లించేందుకు డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని