అపోలో హాస్పిటల్స్ డివిడెండ్ రూ.11.75
గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ రూ.90 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే కాల లాభం రూ.168 కోట్లతో పోలిస్తే
దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ రూ.90 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే కాల లాభం రూ.168 కోట్లతో పోలిస్తే ఇది 46 శాతం తక్కువ. ఇదే సమయంలో ఆదాయం రూ.2,868 కోట్ల నుంచి 24 శాతం పెరిగి రూ.3,546.40 కోట్లకు చేరింది. మూలధన లాభాల పన్ను కోసం రూ.88.2 కోట్లను కేటాయించడంతో లాభం తగ్గింది. అపోలో ఫార్మసీ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాన్ని పునర్వ్యవస్థీకరించి, గ్రూప్ డిజిటల్ హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ అపోలో 24/7తో పాటు అపోలో హెల్త్ కంపెనీ లిమిటెడ్‌కు 100 శాతం అనుబంధ సంస్థగా మార్చారు. అపోలో హెల్త్ కంపెనీ ప్రస్తుతం గ్రూప్ ఓమ్నిఛానెల్ డిజిటల్ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫామ్‌గా పని చేయనుంది. ప్రాథమిక చికిత్స, డయాగ్నోస్టిక్స్, ఫార్మసీ డిస్ట్రిబ్యూషన్, కండిషన్ మేనేజ్మెంట్ సేవలను అందించడం ద్వారా వచ్చే మూడేళ్లలో 300 కోట్ల డాలర్లకు పైగా (సుమారు రూ.23,000 కోట్లు) స్థూల వ్యాపార విలువను (జీఎంవీ) సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఏకీకృత నికర లాభం రూ.1,056 కోట్లకు చేరింది. 2020-21లో ఇది రూ.150 కోట్లుగా ఉంది. కార్యకలాపాల ఆదాయం రూ.10,560 కోట్ల నుంచి రూ.14,663 కోట్లకు పెరిగింది. రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.11.75 చొప్పున డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు సిఫారసు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్