22% తగ్గిన అదానీ పోర్ట్స్‌ లాభం

అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఈజెడ్‌) గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,033 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక

Published : 26 May 2022 05:42 IST

దిల్లీ: అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఈజెడ్‌) గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,033 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాల లాభం రూ.1,321 కోట్లతో పోలిస్తే ఇది 21.78 శాతం తక్కువ. ఏకీకృత మొత్తం ఆదాయం రూ.4,072.42 కోట్ల నుంచి రూ.4,417.87 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ.2,526.91 కోట్ల నుంచి రూ.3,309.18 కోట్లకు పెరిగాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మెరుగైన పని తీరు ప్రదర్శించిందని ఏపీఎస్‌ఈజెడ్‌ సీఈఓ, పూర్తి కాల డైరెక్టర్‌ కరణ్‌ అదానీ వెల్లడించారు. ఒక్క ముంద్రా పోర్టు నుంచే 150 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు (ఎంఎంటీ) సహా మొత్తం 312 ఎంఎంటీల కార్గో పరిమాణంతో రికార్డు సాధించామని కంపెనీ పేర్కొంది. 2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నికర లాభం రూ.5,048.74 కోట్లకు పెరిగింది. 2020-21లో ఇది రూ.4,795.24 కోట్లు. ఇదే సమయంలో ఏకీకృత ఆదాయం (గంగవరం పోర్టు మినహా) 27 శాతం పెరిగి రూ.15,934 కోట్లకు చేరింది. పోర్టులు, లాజిస్టిక్స్‌, ఎస్‌ఈజెడ్‌ విభాగాల్లో వ్యాపార వృద్ధి వల్లే ఇది సాధ్యమైందని కంపెనీ వివరించింది. కార్గో పరిమాణంలో డ్రై కార్గో 42 శాతం, కంటైనర్లు 14 శాతం, లిక్విడ్స్‌ 19 శాతం మేర వృద్ధి సాధించాయని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని