రీపోస్‌లో రతన్‌ టాటా పెట్టుబడి

ముంబయి: పరిశ్రమలకు అవసరమైన డీజిల్‌, సీఎన్‌జీ, ఎల్‌ఎన్‌జీ, విద్యుత్‌ వాహన ఛార్జింగ్‌లను, వినియోగదారుల వద్దకే వెళ్లి అందించే అంకుర సంస్థ రీపోస్‌ ఎనర్జీలో టాటా సన్స్‌ గౌరవ ఛైర్మన్‌

Published : 26 May 2022 03:14 IST

ముంబయి: పరిశ్రమలకు అవసరమైన డీజిల్‌, సీఎన్‌జీ, ఎల్‌ఎన్‌జీ, విద్యుత్‌ వాహన ఛార్జింగ్‌లను, వినియోగదారుల వద్దకే వెళ్లి అందించే అంకుర సంస్థ రీపోస్‌ ఎనర్జీలో టాటా సన్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా పెట్టుబడులు పెట్టారు. సిరీస్‌ ఎ ఫండింగ్‌లో భాగంగా రూ.56 కోట్లను ఆయన సమకూర్చారు. రతన్‌ టాటాతో పాటు మరికొంతమంది పెట్టుబడి సమకూర్చినట్లు సంస్థ పేర్కొంది. టాటా ఇప్పటికే ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టగా, మరోసారి ఈ మొత్తాన్ని సమకూర్చారు. కొత్తగా వచ్చిన నిధులను సంస్థ విస్తరణ, ఇతర అవసరాల కోసం వినియోగించనున్నట్లు ఈ సంస్థ వ్యవస్థాపకులు చేతన్‌ వాలున్జ్‌, అదితి భోస్లే వాలున్జ్‌ తెలిపారు. ప్రస్తుతం ఈ సంస్థ 220 పట్టణాల్లో 1,500 మంది భాగస్వాములను కలిగి ఉంది. 2,500 రీపోస్‌ మొబైల్‌ ఫ్యూయల్‌ పంపులను నిర్వహిస్తోంది. డీజిల్‌ డెలివరీ కోసం మహీంద్రా ఫూరియో ట్రక్కులను వినియోగించేందుకు రీపోస్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రాల మధ్య ఒప్పందం కుదిరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని