పన్ను చెల్లించమని తనిఖీల్లో వేధించొద్దు

 కొంత మంది పన్నుల అధికారులు పన్ను వసూళ్ల కోసం బలవంతపు చర్యలకు పాల్పడుతుండటంపై జీఎస్‌టీ దర్యాప్తు కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. తనిఖీ/ దర్యాప్తు ప్రక్రియ సమయంలో ఎప్పుడైనా

Updated : 27 May 2022 04:01 IST

అధికారులకు జీఎస్‌టీ దర్యాప్తు కార్యాలయం సూచన

దిల్లీ: కొంత మంది పన్నుల అధికారులు పన్ను వసూళ్ల కోసం బలవంతపు చర్యలకు పాల్పడుతుండటంపై జీఎస్‌టీ దర్యాప్తు కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. తనిఖీ/ దర్యాప్తు ప్రక్రియ సమయంలో ఎప్పుడైనా పన్నుల బకాయిలను సంస్థలు చెల్లించవచ్చని స్పష్టం చేసింది. తనిఖీ లేదా దర్యాప్తు సమయంలోనే పన్ను బకాయిలు చెల్లించాలంటూ బలవంతపెట్టే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా చీఫ్‌ కమిషనర్‌లకు సూచించింది. స్వచ్ఛందంగా పన్ను చెల్లింపులు చేసేందుకు ఎటువంటి పరిమితులు, ఆంక్షలు లేవని తెలిపింది.  

కాంపోజిషన్‌ పన్ను చెల్లింపుదార్లకు  రెండు నెలల పాటు ఆలస్య రుసుం రద్దు: కాంపోజిషన్‌ పథకం కింద నమోదైన చిన్న పన్ను చెల్లింపుదార్లు 2021-22 సంవత్సరానికి జీఎస్‌టీ రిటర్న్‌ (జీఎస్‌టీఆర్‌-4) ఆలస్యంగా దాఖలు చేసినా, వారికి 2 నెలల పాటు ఆలస్య రుసుమును ప్రభుత్వం రద్దు చేసింది. మే 1 నుంచి జూన్‌ 30 వరకు ఆలస్య రుసుమును రద్దు చేశారు. లేకపోతే ఆలస్య రుసుం కింద రోజుకు రూ.50 వసూలు చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని