ఒకసారి ఛార్జింగ్‌తో 528 కిలోమీటర్లు

కియా విద్యుత్తు కారు ఈవీ6ను గురువారం జూబ్లీహిల్స్‌లోని కార్‌ కియా విక్రయ కేంద్రంలో ఆవిష్కరించారు. రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి కేఎస్‌ శ్రీనివాసరాజు,

Updated : 27 May 2022 04:02 IST

కియా ఈవీ6 కారు ఆవిష్కరణ

హైదరాబాద్‌ (జూబ్లీహిల్స్‌), న్యూస్‌టుడే: కియా విద్యుత్తు కారు ఈవీ6ను గురువారం జూబ్లీహిల్స్‌లోని కార్‌ కియా విక్రయ కేంద్రంలో ఆవిష్కరించారు. రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి కేఎస్‌ శ్రీనివాసరాజు, సంయుక్త రవాణా కమిషనర్లు సి.రమేష్‌, పాండురంగ నాయక్‌, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ పాపారావు, కార్‌ కియా జీఎం భీమా సంతోష్‌ తదితరులు ఆవిష్కరించారు. రూ.3 లక్షలు ముందస్తుగా చెల్లించి ఈ వాహనాన్ని బుకింగ్‌ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. జూన్‌లో ఈవీ6లు విపణిలోకి విడుదల కానున్నాయని పేర్కొంది. 77.4 కిలోవాట్‌ అవర్‌ లిథియం అయాన్‌ బ్యాటరీతో తయారైన ఈ వాహనం ఒకసారి ఛార్జింగ్‌తో 528 కి.మీ. ప్రయాణిస్తుందని తెలిపింది. కేవలం 5.2 సెకన్లలోనే 100 కి.మీ. గరిష్ఠ వేగం అందుకుంటుందని వివరించింది.  8 ఎయిర్‌బ్యాగ్‌లతో ఈ కారును తీర్చిదిద్దామని, అయిదు రంగుల్లో లభ్యమవుతుందని కియా ఇండియా ఎండీ, సీఈఓ టే జిన్‌ పార్క్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని