
రూ.2000 నోట్ల వాటా 1.6 శాతమే
మూడేళ్లుగా వీటి ముద్రణే లేదు
అధికంగా వాడుతోంది రూ.500 నోటే
ఈనాడు, దిల్లీ : దేశంలో చలామణిలో ఉన్న మొత్తం నోట్లలో రూ.2000 నోట్ల వాటా 1.6 శాతానికి పరిమితమైంది. 2016లో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసినప్పుడు, సత్వరం వ్యవస్థలో నగదును అందుబాటులోకి తెచ్చేందుకు రూ.2వేల నోట్లను ప్రవేశపెట్టారు. తదుపరి రూ.500, 200, 100, రూ.50, రూ.20, రూ.10 నోట్లు కూడా కొత్తవి ముద్రించి, చలామణిలోకి తెచ్చాక, రూ.2000 నోట్ల ముద్రణను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మూడేళ్ల క్రితం నిలిపేసింది. అత్యధిక బ్యాంకులు ఏటీఎంలలోనూ వీటిని ఉంచడం లేదు ఫలితంగా మొత్తం నగదులో వీటి వాటా బాగా తగ్గుతోంది. ఇదే సమయంలో రూ.500 నోట్ల వాటా పెరుగుతోంది.
నగదు చలామణి పెరుగుతోంది
నగదు చలామణి మాత్రం గత మూడేళ్లలో 28.28%మేర పెరిగింది. అన్ని డినామినేషన్లు కలిపి 2020లో రూ.24,20,975 కోట్ల విలువైన బ్యాంకు నోట్లు చలామణిలో ఉండగా, 2021 నాటికి ఈ విలువ రూ.28,26,863 కోట్లకు, 2022 నాటికి రూ.31,05,721 కోట్లకు చేరింది.
* ప్రస్తుతం చలామణిలో ఉన్న నగదులో 73.3% విలువ రూ.500 నోట్లదే. రూ2,000+రూ.500 నోట్లు కలిపితే వీటి విలువ 87.1%మేర ఉంది. నోట్ల సంఖ్యా పరంగా చూస్తే రూ.500 నోట్లు రూ.34.9%, రూ.10నోట్లు 21.3%, రూ.100 నోట్లు 13.9% మేర ఉన్నాయి. గత మూడేళ్లలో మార్కెట్ చలామణిలో రూ.10, రూ.50, రూ.100, రూ.2,000 నోట్లు తగ్గితే, రూ.20, రూ.500 నోట్ల సంఖ్య బాగా పెరిగింది. రూ.200 నోట్ల పరిస్థితి యథాతథంగా ఉంది. చిల్లర నాణేల చలామణి యేటా పెరుగుతూ వస్తోంది. 2022లో మొత్తం రూ.27,970 కోట్ల విలువైన నాణేలు ప్రజల చేతుల్లో ఉన్నాయి. వీటివిలువ మూడేళ్లలో 6% పెరిగింది. నోట్ల ముద్రణను 2021-22లో రిజర్వ్‌బ్యాంక్ 1.8% మేర తగ్గించింది.
ఏడాది కాలంలో 10% పెరిగిన నకిలీ నోట్లు: ఏడాది కాలంలో నకిలీ నోట్లు 10.71%మేర పెరిగాయి. 2020-21లో 2,08,625 నకిలీ నోట్లు కనిపించగా, 2021-22లో 2,30,971 వెలుగుచూశాయి. ఇందులో 6.9% రిజర్వ్‌బ్యాంకులో కనిపించగా, 93.1% ఇతర బ్యాంకుల్లో వెలుగులోకి వచ్చాయి. 2020-21తో పోలిస్తే 2021-22లో రూ.10 నకిలీ నోట్లు 16.4%, రూ.20 నోట్లు 16.5%, రూ.200 నోట్లు 11.7%, రూ.500 నోట్లు 101.9%, రూ.2వేల నకిలీ నోట్లు 54.6%మేర పెరిగాయి. రూ.50 నకిలీ నోట్లు 28.7%, రూ.100 నోట్లు 16.7%మేర తగ్గాయి.
బ్యాంకు మోసాల సంఖ్య పెరిగింది... విలువ తగ్గింది: గత మూడేళ్లలో బ్యాంకు మోసాల సంఖ్య పెరిగినా, అందులో ఇమిడి ఉన్న విలువ మాత్రం తగ్గింది. 2019-20లో మొత్తం 8,703 మోసాల వల్ల రూ.1,85,468 కోట్ల నష్టం జరిగింది. 2021-22లో మోసాల సంఖ్య 9,103కి పెరిగినా నష్టం విలువ రూ.60,414కోట్లకు పరిమితమైంది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 3,078 కోట్ల మోసాలు (33.8%)జరిగాయి. వీటి మొత్తం విలువ రూ.40,282 (66.7%) కోట్లుగా ఉంది. ప్రైవేటురంగ బ్యాంకుల్లో 5,334 (58.6%) మోసాటు జరిగినా, వీటి విలువ రూ.17,588 (29.1%)కోట్లకే పరిమితమైంది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఎక్కువగా రుణాల్లోనే మోసం జరుగుతున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. ప్రైవేటు బ్యాంకుల్లో కార్డులు, ఇంటర్నెట్ మోసాలు అధికంగా చోటుచేసుకుంటున్నట్లు తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటురంగ బ్యాంకుల్లో కలిపి రూ.58,328 కోట్ల (96.5%) మోసం రుణాల రూపంలోనే జరిగింది.
597.51 బి. డాలర్లకు ఫారెక్స్ నిల్వలు: మే 20తో ముగిసిన వారంలో భారత విదేశీ మారక నిల్వలు 4.23 బిలియన్ డాలర్లు పెరిగి 597.509 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ గణాంకాలు సూచిస్తున్నాయి. అంతక్రితం వారంలో ఇవి 2.676 బిలియన్ డాలర్లు తగ్గి 593.279 బి. డాలర్లకు పరిమితమయ్యాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Kishan Reddy: ఇచ్చిన మాట ప్రకారం మోదీ భీమవరం వచ్చారు: కిషన్‌రెడ్డి
-
Movies News
Alluri Sitarama Raju: వెండితెరపై వెలిగిన మన్యం వీరులు వీరే..
-
Sports News
Jasprit Bumrah: ఇంగ్లాండ్ గడ్డపై బుమ్రా మరో రికార్డు..
-
Politics News
Talasani: మోదీజీ.. కేసీఆర్ ప్రశ్నలకు సమాధానాలేవీ?: తలసాని
-
World News
Sri Lanka: శ్రీలంకలో పాఠశాలల మూసివేత..మరోమారు భారత్ ఇంధన సాయం
-
General News
Raghurama: రఘురామకృష్ణరాజు ఇంటి వద్ద వ్యక్తి హల్చల్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- బిగించారు..ముగిస్తారా..?
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య