రెండో రోజూ జోరే

సూచీలు రెండో రోజూ లాభాల జోరును కొనసాగించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో ఐటీ, బ్యాంకింగ్‌, వాహన షేర్లు పరుగులు తీశాయి. దీంతో నిఫ్టీ మళ్లీ 16,300 పాయింట్ల ఎగువన ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసలు పెరిగి 77.58 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లు లాభపడగా, ఐరోపా షేర్లు మెరుగ్గా ట్రేడయ్యాయి.

Published : 28 May 2022 05:03 IST

16,300 ఎగువకు నిఫ్టీ

సమీక్ష

సూచీలు రెండో రోజూ లాభాల జోరును కొనసాగించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో ఐటీ, బ్యాంకింగ్‌, వాహన షేర్లు పరుగులు తీశాయి. దీంతో నిఫ్టీ మళ్లీ 16,300 పాయింట్ల ఎగువన ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసలు పెరిగి 77.58 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లు లాభపడగా, ఐరోపా షేర్లు మెరుగ్గా ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 54,671.50 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. కొనుగోళ్ల మద్దతుతో రోజంతా అదే ధోరణి కొనసాగించిన సూచీ.. ఇంట్రాడేలో 54,936.63 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 632.13 పాయింట్ల లాభంతో 54,884.66 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 182.30 పాయింట్లు పెరిగి 16,352.45 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,221.95- 16,370.60 పాయింట్ల మధ్య కదలాడింది. వారం ప్రాతిపదికన చూస్తే.. సెన్సెక్స్‌ 558.27 పాయింట్లు, నిఫ్టీ 86.30 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

* పారదీప్‌ ఫాస్పేట్స్‌ షేరు అరంగేట్రంలో మెరిసింది. ఇష్యూ ధర రూ.42తో పోలిస్తే బీఎస్‌ఈలో 3.69% లాభంతో రూ.43.55 వద్ద షేరు నమోదైంది. ఇంట్రాడేలో 12.5% దూసుకెళ్లి రూ.47.25 వద్ద గరిష్ఠానికి చేరింది. చివరకు 4.64% లాభంతో రూ.43.95 వద్ద ముగిసింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 23 రాణించాయి. టెక్‌ మహీంద్రా 4.10%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 3.18%, విప్రో 2.98%, బజాజ్‌ ఫైనాన్స్‌ 2.98%, ఎం అండ్‌ ఎం 2.67%, ఇన్ఫోసిస్‌ 2.60%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 2.35%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 2.32%, ఎల్‌ అండ్‌ టీ 2.26%, హెచ్‌యూఎల్‌ 2.15%, కోటక్‌ బ్యాంక్‌ 1.97% రాణించాయి. ఎన్‌టీపీసీ 2.43%, భారతీ ఎయిర్‌టెల్‌ 1.24%, పవర్‌గ్రిడ్‌ 0.97%, టాటా స్టీల్‌ 0.81% నష్టపోయాయి.

* పంట సంరక్షణకు డ్రోన్‌ ఆధారిత సొల్యూషన్‌లు అందించే జనరల్‌ ఏరోనాటిక్స్‌లో 50 శాతం వాటాను అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ కొనుగోలు చేయనుంది. జులై 31కు ఈ లావాదేవీ పూర్తయ్యే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని