Published : 29 May 2022 02:34 IST

రూ.20,300 కోట్ల టెంపర్డ్‌ గ్లాస్‌ ఎగుమతికి అవకాశం

నాణ్యతను పాటిస్తే సాధ్యమే

భారత సెల్యులర్‌ సంఘం అంచనా

దిల్లీ: మొబైల్‌ తెరను రక్షించేందుకు వాడే టెంపర్డ్‌ గ్లాస్‌(రక్షణ పలకలు) తయారీలో నాణ్యత, సరైన ప్రమాణాలను పాటిస్తే భారీ ఎగుమతి అవకాశాలను భారత్‌ అందిపుచ్చుకోవని ఇండియా సెల్యులర్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌(ఐసీఈఏ) తన నివేదికలో పేర్కొంది. 2025 కల్లా 95.1 కోట్ల టెంపర్డ్‌ గ్లాస్‌లు లేదా రూ.20,300 కోట్ల అవకాశాలున్నాయని తెలిపింది. దేశీయ మార్కెట్‌తో పాటు, ఎగుమతుల్లోనూ వృద్ధిని పెంచుకోవాలంటే అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉందని ఐసీఈఏ పేర్కొంది. ‘దేశీయ మార్కెట్‌ విషయానికొస్తే 2025 కల్లా స్మార్ట్‌ఫోన్లకు 55 కోట్ల వరకు టెంపర్డ్‌ గ్లాస్‌ స్క్రీన్‌ ప్రొటెక్టర్స్‌(టీజీ-ఎస్‌పీ) అవసరం ఉంది. ఇంత భారీ గిరాకీ ఉన్నా.. ఈ ఉత్పత్తి సరఫరాకు బ్రాండెడ్‌ తయారీదార్లు లేరు. చాలా వరకు అంటే 90 శాతం వ్యాపారం అసంఘటిత రంగంలోనే జరుగుతోంది. టెంపర్డ్‌ గ్లాస్‌ను కంపల్సరీ రిజిస్ట్రేషన్‌ ఆర్డర్‌(సీఆర్‌ఓ) వ్యవస్థలోకి తీసుకురావాలి. అపుడే సరైన ప్రమాణాలు వస్తాయి. మొబైల్‌ యాక్సెసరీలైన ఛార్జర్లు, బ్యాటరీలు, హియరబుల్స్‌, వేరబుల్స్‌ల తరహాలోనే టెంపర్డ్‌ గ్లాస్‌ మార్కెట్‌ కూడా సంఘటితమవుతుంద’ని అభిప్రాయపడింది. దేశీయంగా నాసిరకం టీజీ-ఎస్‌పీ విక్రయాలు లేదా దిగుమతులు జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని.. అందుకు నాణ్యత ప్రమాణాలతో ఈ పరిశ్రమను క్రమబద్ధీకరించాలని ఐసీఈఏ ఛైర్మన్‌ పంకజ్‌ మహీంద్రూ పేర్కొన్నారు. ‘ఒక్కసారి ప్రామాణీకరణను సాధిస్తే, చట్టబద్ధమైన, నాణ్యత ఉండే మార్కెట్‌ సృష్టి జరుగుతుంది. స్థానిక సరఫరాదార్లు కూడా సరైన మార్గంలోనే వాటిని విక్రయిస్తారు. మొత్తం సరఫరా వ్యవస్థే మారుతుంద’ని ఆయన వివరించారు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని