Updated : 29 May 2022 05:23 IST

జాతీయ రహదారుల వెంబడి ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌

మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్‌ అనుసంధానతకు వీలు

దిల్లీ: దేశంలోని మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్‌ అనుసంధానత కల్పించేందుకు జాతీయ రహదారుల వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రహదార్లకు ఇరువైపులా ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ (ఓఎఫ్‌సీ) వేసే యోచనలో ప్రభుత్వం ఉందని ఈ పరిణామాన్ని గమనిస్తున్న అధికారిక వర్గాలు వెల్లడించాయి. తొలుత కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారులతో ఈ ప్రక్రియను ప్రారంభించాలని అనుకుంటోంది. మొత్తంగా 18,000 కి.మీ పొడువునా ఓఎఫ్‌సీ మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని భావిస్తోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.  

రెండో దశలో.. ఇప్పటికే ఉన్న జాతీయ రహదారుల్లో కొన్నింటిని కూడా ఓఎఫ్‌సీ మౌలిక వసతుల అభివృద్దికి అనువైనవిగా గుర్తించారని సమాచారం. 2025 నాటికి 2,00,000 కి.మీ పొడువునా జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ రహదారుల వెంబడి ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ విస్తరణకు ప్రభుత్వం యోచిస్తుండటం గమనార్హం. పైలట్‌ ప్రాజెక్టుల కింద హైదరాబాద్‌- బెంగళూరు జాతీయ రహదారి, దిల్లీ- ముంబయి ఎక్స్‌ప్రెస్‌వేలను పైబర్‌ నెట్‌వర్క్‌ మౌలిక వసతుల అభివృద్ధి కోసం గుర్తించారని ఆ వర్గాలు వెల్లడించాయి.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని