అమూల్‌ నుంచి గోధుమ పిండి

అమూల్‌ బ్రాండ్‌ కింద ఉత్పత్తులను విక్రయిస్తున్న డెయిరీ దిగ్గజం జీసీఎమ్‌ఎమ్‌ఎఫ్‌ తాజాగా సేంద్రియ ఆహార మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. తొలి ఉత్పత్తిగా ‘అమూల్‌ ఆర్గానిక్‌ హోల్‌ వీట్‌ ఆటా’ను తీసుకొస్తున్నట్లు గుజరాత్‌ కోఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (జీసీఎమ్‌ఎమ్‌ఎఫ్‌) శనివారమిక్కడ ఒక ప్రకటనలో పేర్కొంది.

Published : 29 May 2022 02:34 IST

సేంద్రియ ఆహార పరిశ్రమలోకి అడుగు

దిల్లీ: అమూల్‌ బ్రాండ్‌ కింద ఉత్పత్తులను విక్రయిస్తున్న డెయిరీ దిగ్గజం జీసీఎమ్‌ఎమ్‌ఎఫ్‌ తాజాగా సేంద్రియ ఆహార మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. తొలి ఉత్పత్తిగా ‘అమూల్‌ ఆర్గానిక్‌ హోల్‌ వీట్‌ ఆటా’ను తీసుకొస్తున్నట్లు గుజరాత్‌ కోఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (జీసీఎమ్‌ఎమ్‌ఎఫ్‌) శనివారమిక్కడ ఒక ప్రకటనలో పేర్కొంది. త్వరలోనే తన ఆర్గానిక్‌ పోర్ట్‌ఫోలియోలో మరిన్ని ఉత్పత్తులనూ ఆవిష్కరించనుంది. కంపెనీకి చెందిన త్రిభువన్‌ దాస్‌ పటేల్‌ మోగార్‌ ఫుడ్‌ కాంప్లెక్స్‌లో అమూల్‌ ఆర్గానిక్‌ ఆటా ఉత్పత్తిని చేపడుతోంది. భారత ప్రభుత్వం నిర్ణయించిన ఆర్గానిక్‌ ప్రమాణాల ప్రకారం ఉండేలా ఉత్పత్తులను లాబ్‌ టెస్టింగ్‌లలో పలు మార్లు పరీక్షిస్తామని ఆ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత పాల సేకరణ నమూనా తరహాలోనే సేంద్రియ రైతుల బృందాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉన్నట్లు కంపెనీ ఎండీ ఆర్‌.ఎస్‌. సోధి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అయిదు ప్రదేశాల్లో ఆర్గానిక్‌ టెస్టింగ్‌ లేబొరేటరీలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. కాగా, ఆర్గానిక్‌ గోధుమ పిండి జూన్‌ నుంచి గుజరాత్‌, దిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబయి, పుణెలలో ఆన్‌లైన్‌ డెలివరీకి సిద్ధంగా ఉంటుందని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని