Published : 29 May 2022 02:34 IST

ఎం&ఎం లాభం రూ.1,192 కోట్లు

ముంబయి: గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) ఏకీకృత ప్రాతిపదికన రూ.1,192 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ ఆర్జించిన రూ.245 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 5 రెట్లు ఎక్కువ. ఆదాయం రూ.13,356 కోట్ల నుంచి 28 శాతం పెరిగి రూ.17,124 కోట్లకు చేరింది. 2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ.984 కోట్ల నుంచి రూ.4,935 కోట్లకు చేరింది. వాహన, వ్యవసాయ విభాగాల నుంచి ఆదాయం 29 శాతం పెరిగి రూ.55,300 కోట్లకు చేరింది. ఇప్పటి వరకు సంస్థకు ఇదే అత్యధిక ఆదాయం కావడం విశేషం. యుటిలిటీ వాహనాల (యూవీలు) పరిమాణం వార్షిక ప్రాతిపదికన మార్చి త్రైమాసికంలో 42 శాతం పెరిగింది. వ్యవసాయ పరికరాల విభాగంలో (ఎఫ్‌ఈఎస్‌) ట్రాక్టర్ల విపణి వాటా 40 శాతానికి చేరింది. వార్షిక ప్రాతిపదికన 1.8 శాతం వృద్ధి నమోదైంది. వాహన ఎగుమతులు 2020-21తో పోలిస్తే 77 శాతం వృద్ధి చెందాయి. ట్రాక్టర్ల ఎగుమతులు 66 శాతం పెరిగి 77,500కు చేరాయి.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని