
రూ.4.30 లక్షల కోట్లకు మీడియా,వినోద పరిశ్రమ
2026కు చేరొచ్చు:పీడబ్ల్యూసీ
దిల్లీ: భారత మీడియా, వినోద పరిశ్రమ 8.8 వార్షిక సంచిత వృద్ధి రేటుతో (సీఏజీఆర్) 2026 నాటికి రూ.4.30 లక్షల కోట్ల స్థాయికి చేరే అవకాశం ఉందని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ అంచనా వేసింది. ఈ ఏడాది ఆఖరుకు పరిశ్రమ 11.4 శాతం వృద్ధితో రూ.3.14 లక్షల కోట్ల స్థాయికి చేరొచ్చని పేర్కొంది. దేశీయ విపణిలో ఇంటర్నెట్-స్మార్ట్ఫోన్ల వినియోగం భారీగా పెరగడంతో డిజిటల్ మీడియా, ప్రకటనల్లో అధిక వృద్ధి నమోదు కావొచ్చని తెలిపింది. అయినా కూడా సంప్రదాయ మీడియా స్థిర వృద్ధిని కొనసాగిస్తుందని పేర్కొంది. పీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం..
* టీవీ ప్రకటనల ఆదాయం ఈ ఏడాది రూ.35,270 కోట్లుగా నమోదయ్యే అవకాశం ఉంది. 2026 నాటికి 23.52 శాతం వృద్ధితో రూ.43,568 కోట్లకు చేరుతుంది. దీంతో అంతర్జాతీయ విపణిలో టీవీ ప్రకటనల్లో భారత్ 5వ స్థానానికి చేరుతుంది. అమెరికా, జపాన్, చైనా, యూకే తొలి నాలుగు స్థానాల్లో ఉంటాయి. ఏళ్లపాటు విస్తరిస్తూ వచ్చిన భారత టీవీ ప్రకటనల విపణి, కొవిడ్-19 పరిణామాల ప్రభావంతో 2020లో 10.8 శాతం క్షీణత నమోదు చేసింది. 2021లో ఆర్థిక వృద్ధి తిరిగి గాడిన పడటంతో ఈ విభాగాదాయం 16.9 శాతం వృద్ధితో రూ.32,374 కోట్లకు చేరింది.
* ఓటీటీ (ఓవర్ ద టాప్) వీడియో సేవల రంగం వచ్చే నాలుగేళ్లలో రూ.21,031 కోట్లకు పెరుగుతుంది. ఇందులో రూ.19,973 కోట్ల ఆదాయం చందా ఆధారిత సేవల ద్వారా, రూ.1,058 కోట్లు ట్రాన్సాక్షనల్ వీఓడీ (వీడియో ఆన్ డిమాండ్) ద్వారా సమకూరతాయి. అధిక జనాభా, మొబైల్ ఇంటర్నెట్ ద్వారా వీడియోల వీక్షణం వల్ల, ఓటీటీ విపణిలో గణనీయ వృద్ధి నమోదు కానుంది. 5జీ సేవలూ ప్రారంభమైతే ఓటీటీ వీడియో స్ట్రీమింగ్ మరింత వృద్ధి చెందుతుంది.
* ఇంటర్నెట్ ప్రకటనల విపణి 2026కు 12.1 సీఏజీఆర్‌తో రూ.28,234 కోట్లకు చేరుతుంది.
* సంగీతం, రేడియో, పాడ్‌కాస్ట్ విభాగాదాయం 2021లో 18 శాతం పెరిగి రూ.7,216 కోట్లకు చేరింది. 2026కు ఈ విభాగం కూడా 9.8 శాతం సీఏజీఆర్‌తో రూ.11,536 కోట్లకు చేరొచ్చు.
* వీడియో గేమ్‌లు, ఇస్పోర్ట్స్ ఆదాయం 18.3 శాతం సీఏజీఆర్‌తో 2026కు రూ.37,535 కోట్లకు చేరుతుంది.
* సినిమా పరిశ్రమ ఆదాయం 2026కు రూ.16,198 కోట్లకు చేరుతుంది. ఇందులో రూ.15,489 కోట్లు బాక్సాఫీస్ నుంచి, మిగతా రూ.349 కోట్లు ప్రకటనల రూపంలో రానుంది. 2021లో 37.9 కోట్లకు పైగా సినిమా టిక్కెట్లు భారత్‌లో అమ్ముడుపోయాయి. 2020లో ఈ సంఖ్య 27.8 కోట్లు మాత్రమే. కొవిడ్‌కు ముందు దేశంలో 190 కోట్ల టిక్కెట్లు విక్రయమయ్యాయి. కరోనా పరిణామాల ప్రభావంతో దాదాపు 85.4 శాతం క్షీణత నమోదైంది.
వార్తాపత్రికలు
వార్తాపత్రికల ఆదాయం 2021లో రూ.26,378 కోట్లు కాగా, 2026కు 2.7 శాతం సీఏజీఆర్‌తో రూ.29,945 కోట్లకు చేరుతుంది. అప్పటికి వార్తాపత్రికల విపణిలో ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్‌లను అధిగమించి, అంతర్జాతీయంగా భారత్ 5వ స్థానానికి చేరుతుంది. అయిదేళ్ల పాటు వార్తాపత్రికల ఆదాయం భారత్‌లో మాత్రమే పెరగనుంది. రోజువారీ ప్రింట్ కాపీల విక్రయాలు కూడా ఒక్క భారత్‌లోనే పెరుగుతాయి. 1.3 శాతం సీఏజీఆర్‌తో, 2026 నాటికి రోజువారీ సరాసరి 13.9 కోట్ల వార్తాపత్రికల కాపీలు విక్రయమవుతాయి. అంతర్జాతీయంగా ముద్రితమవుతున్న వార్తాపత్రికల్లో ఈ సంఖ్య మూడో వంతు కావడం విశేషం. ప్రపంచ విపణిలో ప్రింట్ ఎడిషన్ రీడర్‌షిప్‌లో 2025 నాటికి చైనాను భారత్ అధిగమించే అవకాశం ఉంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
Reliance Retail: రిలయన్స్ రిటైల్ రారాణిగా ఈశా అంబానీ?
-
World News
UN: ‘పాత్రికేయుల్ని జైలుపాలు చేయొద్దు’.. జుబైర్ అరెస్టుపై స్పందించిన ఐరాస
-
Sports News
T20 League : ఇక నుంచి భారత టీ20 లీగ్ 75 రోజులు.. మ్యాచ్‌లు పెరిగే అవకాశం!
-
India News
Agnipath IAF: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. 6 రోజుల్లోనే 1.83లక్షల మంది నమోదు
-
Politics News
Telangana News: భాజపాలోకి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి?
-
Sports News
Wimbledon 2022 : వింబుల్డన్‌లో యువ ప్లేయర్ సంచలనం.. అమెరికా దిగ్గజం ఇంటిముఖం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Actress Meena: ఊపిరితిత్తుల సమస్యతో నటి మీనా భర్త మృతి
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
- Actress Meena: మీనా భర్త మృతి.. పావురాల వ్యర్థాలే కారణమా..?
- Udaipur Murder: భగ్గుమన్న ఉదయ్‌పుర్
- Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
- DilRaju: తండ్రైన దిల్‌రాజు.. మగబిడ్డకు జన్మనిచ్చిన తేజస్విని
- ఒత్తిళ్లకు లొంగలేదని బదిలీ బహుమానం!
- IND vs IRE : గెలిచారు.. అతి కష్టంగా
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29-06-22)
- IND vs IRE : అందుకే ఆఖరి ఓవర్‌ను ఉమ్రాన్‌కు ఇచ్చా : హార్దిక్ పాండ్య