Published : 24 Jun 2022 03:33 IST

ఒడుదొడుకులున్నా లాభాలే

మెరిసిన వాహన, ఐటీ షేర్లు  

సమీక్ష

ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో సూచీలు లాభాలు నమోదుచేశాయి. వాహన, ఐటీ, బ్యాంకింగ్‌ షేర్లు ఇందుకు మద్దతుగా నిలిచాయి. అమెరికా మాంద్యం భయాలు, మిశ్రమ అంతర్జాతీయ సంకేతాలను దేశీయ మదుపర్లు పక్కనపెట్టారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి రికార్డు కనిష్ఠమైన 78.32 వద్ద యథాతథంగా ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు ధర 1.92 శాతం తగ్గి 109.60 డాలర్లకు చేరింది. ఆసియా మార్కెట్లు రాణించగా, ఐరోపా షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 51,972.75 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై, ఇంట్రాడేలో 52,516.79 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని నమోదుచేసింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్న సూచీ 51,632.85 పాయింట్లకు పడిపోయింది. మళ్లీ కోలుకున్న సెన్సెక్స్‌ 443.19 పాయింట్ల లాభంతో 52,265.72 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 143.35 పాయింట్లు పెరిగి 15,556.65 దగ్గర స్థిరపడింది. 

​​​​​​​* సెన్సెక్స్‌ 30 షేర్లలో 27 రాణించాయి. మారుతీ 6.33%, ఎం అండ్‌ ఎం 4.41%, ఏషియన్‌ పెయింట్స్‌ 3.39%, భారతీ ఎయిర్‌టెల్‌ 2.76%, టీసీఎస్‌ 2.70%, విప్రో 1.97%, సన్‌ఫార్మా 1.94%, హెచ్‌యూఎల్‌ 1.94%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.86%, నెస్లే 1.30% లాభపడ్డాయి. రిలయన్స్‌ 1.62%, ఎన్‌టీపీసీ 0.94%, పవర్‌గ్రిడ్‌ 0.90% నష్టపోయాయి.  

తగ్గిన పీ-నోట్ల పెట్టుబడులు: పీ-నోట్ల ద్వారా భారత స్టాక్‌ మార్కెట్లలోకి వచ్చిన పెట్టుబడులు మే ఆఖరుకు రూ.86,706 కోట్లకు తగ్గాయి. ఇందులో ఈక్విటీల్లో రూ.77,402 కోట్లు, డెట్‌లో రూ.9,209 కోట్లు, హైబ్రిడ్‌ సెక్యూరిటీల్లో రూ.101 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఏప్రిల్‌ చివరికి ఇవి రూ.90,580 కోట్లుగా నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి ఆఖరుకు రూ.87,989 కోట్లు, ఫిబ్రవరి చివరకు రూ.89,143 కోట్లు, మార్చి ముగిసేసరికి రూ.87,979 కోట్లుగా ఉన్నాయి. రాబోయే 1-2 త్రైమాసికాల్లో విదేశీ మదుపర్ల అమ్మకాలు ఆగుతాయని, మళ్లీ మార్కెట్లలోకి పెట్టుబడులు వస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు.

* డిష్‌ టీవీ అసాధారణ సర్వసభ్య సమావేశం (ఈజీఎం)లో ఓటింగ్‌ నుంచి యెస్‌ బ్యాంక్‌ను తప్పించాలని కోరుతూ వరల్డ్‌ క్రెస్ట్‌ అడ్వైజర్స్‌ ఎల్‌ఎల్‌పీ దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తోసిపుచ్చింది. డిష్‌ టీవీ ఈజీఎం నేడు (శుక్రవారం) జరగనుంది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని