రష్యా నుంచి చమురు దిగుమతులు 50 రెట్లు పెరిగాయ్‌

రష్యా నుంచి భారత్‌కు చమురు దిగుమతులు, ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి 50 రెట్లు పెరిగాయని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం భారత్‌ దిగుమతి చేసుకుంటున్న మొత్తం చమురులో రష్యా వాటానే 10 శాతమని పేర్కొన్నారు. మన దేశానికి

Published : 24 Jun 2022 03:33 IST

దిల్లీ: రష్యా నుంచి భారత్‌కు చమురు దిగుమతులు, ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి 50 రెట్లు పెరిగాయని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం భారత్‌ దిగుమతి చేసుకుంటున్న మొత్తం చమురులో రష్యా వాటానే 10 శాతమని పేర్కొన్నారు. మన దేశానికి చమురు అధికంగా సరఫరా చేసే 10 దేశాల్లో రష్యా చేరిందని వివరించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి ముందు ఇది కేవలం 0.2 శాతంగా ఉండేదని వివరించారు. రష్యా నుంచి కొంటున్న చమురులో 40 శాతం వరకు  ప్రైవేట్‌ సంస్థలే (రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, రోస్‌నెఫ్ట్‌కు చెందిన నయారా ఎనర్జీ) తీసుకొస్తున్నాయి. మే నెలలో చూస్తే భారత్‌కు రెండో అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా అవతరించింది. అంతకుముందు ఈ స్థానంలో సౌదీ అరేబియా ఉండేది. మొదటి స్థానంలో ఇరాక్‌ కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని