Published : 24 Jun 2022 03:33 IST

పట్టణ సహకార బ్యాంకులు కొత్త పద్ధతులు అందిపుచ్చుకోవాలి

కేంద్ర మంత్రి అమిత్‌ షా

దిల్లీ: పట్టణ సహకార బ్యాంకులు(యూసీబీలు) కీలక సంస్కరణలను చేపట్టాలని కేంద్ర మంత్రి అమిత్‌ షా పిలుపునిచ్చారు. నైపుణ్యం ఉన్న యువకులను నియమించుకోవడం, ఆధునిక బ్యాంకింగ్‌ పద్ధతులను అందిపుచ్చుకోవడం ద్వారా పోటీలో నిలదొక్కుకోవచ్చని అన్నారు. నిర్మాణాత్మక మార్పులు, మానవ వనరుల బలోపేతం, ఖాతాల కంప్యూటరైజేషన్‌, అదనపు నిధుల నిర్వహణకు నిపుణుల నియామకం తదితర సంస్కరణలనూ చేపడితేనే జాతీయ, ప్రైవేటు బ్యాంకులతో అవి పోటీపడగలవన్నారు. ఈ సంస్కరణల అమలు ద్వారా యూసీబీలు ప్రస్తుత కాలానికి తగ్గట్లుగా మారాలని సూచించారు. అదే సమయంలో సహకార బ్యాంకులను ‘ద్వితీయ శ్రేణి సంస్థలు’గా చూడబోమని గురువారమిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. ‘సమాజంలో దిగువ స్థాయి ప్రజలకు రుణాలిచ్చేవి సహకార బ్యాంకులే కాబట్టి దేశంలోని ప్రతి పట్టణంలో ఒక యూసీబీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంద’ని అమిత్‌ షా అభిప్రాయపడ్డారు. ‘దేశంలో ప్రస్తుతం 1534 యూసీబీలు, 54 షెడ్యూల్డ్‌ యూసీబీలు, 35 బహుళరాష్ట్ర సహకార బ్యాంకులు, 580 బహుళ రాష్ట్ర సహకార రుణ సంఘాలు, 22 రాష్ట్ర సహకార బ్యాంకులున్నాయి. విస్తృత స్థాయిలో ఉన్నప్పటికీ.. అసమాన పద్ధతిలో ఉన్నాయి. కాబట్టి యూసీబీ అభివృద్ధి సౌష్ఠవంగా ఉండాల్సిన అవసరం ఉంద’న్నారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని