రూ.2 లక్షల పసిడికి ఇ వేబిల్లు తప్పనిసరి!

రూ.2 లక్షలు, అంతకుమించి విలువైన పసిడి లేదా విలువైన రాళ్లను అంతరాష్ట్ర రవాణా చేసేందుకు ఇ-వేబిల్లులను తప్పనిసరి చేసే అంశాన్ని జీఎస్‌టీ మండలి తదుపరి సమావేశం పరిశీలించే అవకాశం ఉంది. రూ.2 లక్షలకు మించి, ఎంత విలువ నుంచి ఇ-వే బిల్లు తప్పనిసరి

Published : 24 Jun 2022 03:32 IST

దిల్లీ: రూ.2 లక్షలు, అంతకుమించి విలువైన పసిడి లేదా విలువైన రాళ్లను అంతరాష్ట్ర రవాణా చేసేందుకు ఇ-వేబిల్లులను తప్పనిసరి చేసే అంశాన్ని జీఎస్‌టీ మండలి తదుపరి సమావేశం పరిశీలించే అవకాశం ఉంది. రూ.2 లక్షలకు మించి, ఎంత విలువ నుంచి ఇ-వే బిల్లు తప్పనిసరి చేయాలన్నది రాష్ట్రాలు నిర్ణయించుకోవచ్చు. రూ.20 కోట్ల వార్షిక టర్నోవరు ఉండి, పసిడి లేదా విలువైన రాళ్లను సరఫరా చేసే పన్ను చెల్లింపుదార్లు బీటుబీ లావాదేవీలకు ఇ-రశీదు జారీ చేయడాన్ని తప్పనిసరి చేసే అంశంపైనా చర్చించొచ్చని అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని