9 స్థిరాస్తి సంస్థలపై సీబీఐ కన్ను

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ నుంచి రూ.14,683 కోట్ల నిధుల్ని 9 స్థిరాస్తి సంస్థలకు అక్రమంగా మళ్లించారని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వెల్లడించింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ అప్పటి ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కపిల్‌ వాధ్వాన్‌, డైరెక్టర్‌ ధీరజ్‌ వాధ్వాన్‌తో పాటు వ్యాపారవేత్త సుధాకర్‌

Published : 24 Jun 2022 03:32 IST

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ నిధుల మళ్లింపు కేసు

దిల్లీ: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ నుంచి రూ.14,683 కోట్ల నిధుల్ని 9 స్థిరాస్తి సంస్థలకు అక్రమంగా మళ్లించారని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వెల్లడించింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ అప్పటి ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కపిల్‌ వాధ్వాన్‌, డైరెక్టర్‌ ధీరజ్‌ వాధ్వాన్‌తో పాటు వ్యాపారవేత్త సుధాకర్‌ షెట్టిలకు ఇందులో హస్తం ఉందని సీబీఐ ఆరోపిస్తోంది. నిధులు మళ్లించిన 9 కంపెనీల్లో షెట్టి సహానా గ్రూప్‌నకు చెందినవే 5 ఉన్నాయని తెలిపింది. మిగతా 4 సంస్థలు ఇతరులవని పేర్కొంది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ రూ.34,615 కోట్ల కుంభకోణంలో కపిల్‌ వాధ్వాన్‌, ధీరజ్‌ వాధ్వాన్‌ సూచనల మేరకే ఈ స్థిరాస్తి సంస్థలకు రుణాలు అక్రమంగా మంజూరు చేశారని, ఇందులో వారికి ఆర్థిక ప్రయోజనాలున్నాయని సీబీఐ ఆరోపిస్తోంది. అమరిల్లిస్‌ రియల్టర్స్‌, గుల్‌మార్గ్‌ రియల్టర్స్‌, స్కైలార్క్‌ బిల్డ్‌కాన్‌లకు రూ.98.33 కోట్లు, దర్శన్‌ డెవలపర్స్‌, సిగ్టియా కన్‌స్ట్రక్షన్స్‌లకు రూ.3,970 కోట్లు రుణాలు మంజూరవగా, అవి డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు తిరిగి చెల్లించలేదని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సీబీఐని సంప్రదించింది. ఈ 5 కంపెనీలు సహానా గ్రూప్‌నకు చెందినవని, దర్శన్‌ డెవలపర్స్‌, సిగ్టియా కన్‌స్ట్రక్షన్స్‌లను వాధ్వాన్‌లే నియంత్రించేవారని సీబీఐ తెలిపింది.

* క్రియేట్స్‌ బిల్డర్స్‌ రూ.1,192 కోట్లు, టౌన్‌షిప్‌ డెవలపర్లు రూ.6,002 కోట్లు, శిశిర్‌ రియాల్టీ రూ.1,233 కోట్లు, సన్‌లింక్‌ రియల్‌ ఎస్టేట్‌ ప్రై.లి, రూ.2,185 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని సీబీఐ అధికారులు వెల్లడించారు.

* బ్యాంకుల్లోని ప్రజా ధనాన్ని రుణాలుగాను, అలాగే మార్పిడి రహిత డిబెంచర్ల జారీ ద్వారా సమీకరించిన మొత్తం రూ.42,871 కోట్లను డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ అక్రమంగా దారి మళ్లించిందని సీబీఐ వెల్లడించింది.

* ఎఫ్‌ఐఆర్‌లో ఈ కంపెనీలను చేర్చడంతో పాటు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఆడిటర్ల పాత్రపైనా సీబీఐ దృష్టి సారించింది. అధిక విలువ కలిగిన రుణాలను, చిన్న రుణాలుగా ఖాతా పుస్తకాల్లో చూపించినా, ఆడిటర్లు తమ నివేదికల్లో ఎందుకు నివేదించలేదో ఆ కోణంలోనూ దర్యాప్తు సాగిస్తున్నామని సీబీఐ అధికారులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని