మహిళా బృందాలను పెంచనున్న మేక్‌మైట్రిప్‌

‘సెలవుల నిపుణులు’తో కూడిన మహిళా బృందాల సంఖ్యను పెంచడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆన్‌లైన్‌ పర్యాటక సంస్థ మేక్‌మైట్రిప్‌ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ బృందాలు అత్యధిక స్థాయిలో ప్యాకేజీలను విక్రయించడంతో పాటు, స్థిర వృద్ధి నమోదుచేశాయని

Published : 24 Jun 2022 03:32 IST

దిల్లీ: ‘సెలవుల నిపుణులు’తో కూడిన మహిళా బృందాల సంఖ్యను పెంచడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆన్‌లైన్‌ పర్యాటక సంస్థ మేక్‌మైట్రిప్‌ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ బృందాలు అత్యధిక స్థాయిలో ప్యాకేజీలను విక్రయించడంతో పాటు, స్థిర వృద్ధి నమోదుచేశాయని తెలిపింది. 2021-22లో సెలవుల నిపుణులుగా సేవలందిస్తున్న మహిళా ఫ్రీలాన్సర్ల బృందాలు దాదాపు రెండు లక్షల మంది పర్యాటకులకు ప్యాకేజీల విషయంలో తోడ్పాటు అందించాయి. గత పదేళ్లలోనే అత్యధిక ప్యాకేజీలను ఈ బృందాలు విక్రయించాయి. ప్రస్తుతం మేక్‌మైట్రిప్‌కు 850 మందికి పైగా మహిళా సెలవుల నిపుణులు ఉన్నారు. ఇందులో 43 శాతం మంది తల్లులు, సంరక్షకులు ఉన్నారు. వీరంతా దిల్లీ, ముంబయి, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్‌, ఇండోర్‌, అహ్మదాబాద్‌, చండీగఢ్‌, లఖ్‌నవూ వంటి నగరాలకు చెందినవారు. మహిళా బృందాలను ఎంత సంఖ్యలో పెంచనున్నారో కంపెనీ వెల్లడించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని