Published : 24 Jun 2022 03:32 IST

హీరో బైక్‌లు, స్కూటర్ల ధరలు రూ.3,000 వరకు పెంపు

దిల్లీ: ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ జులై 1 నుంచి మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరల్ని రూ.3,000 వరకు పెంచబోతున్నట్లు తెలిపింది. ముడి పదార్థాల ధరలతో పాటు ఇతర వ్యయాలు పెరిగినందున, కంపెనీపై పడుతున్న భారాన్ని పాక్షికంగా తగ్గించుకునేందుకు వాహన ధరలు పెంచాల్సి వస్తోందని పేర్కొంది. ఆయా మోడల్‌, విపణిలో గిరాకీ ఆధారంగా ధరల పెంపు ఉంటుందని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు హీరో మోటోకార్ప్‌ సమాచారమిచ్చింది. ప్రారంభ స్థాయి హెచ్‌ఎఫ్‌100 (ప్రారంభ ధర రూ.51,450) నుంచి ఎక్స్‌పల్స్‌ 200 4వీ (రూ.1.32 లక్షలు-ఎక్స్‌షోరూమ్‌, దిల్లీ) వరకు పలు ద్విచక్ర వాహన మోడళ్లను హీరో విక్రయిస్తోంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని