జీఎస్‌టీ పరిహారం చుట్టూనే చర్చంతా

వచ్చే వారంలో జరగనున్న జీఎస్‌టీ మండలి సమావేశంలో జీఎస్‌టీ పరిహారాన్ని మరింత కాలం పొడిగించే అంశంపై ప్రతిపక్షాలు అధికారంలో రాష్ట్రాలు, కేంద్రం మధ్య వాడీవేడి చర్చ జరిగే అవకాశం కన్పిస్తోంది. జీఎస్‌టీ పరిహారం ఇవ్వడాన్ని కొనసాగించాల్సిందిగా

Published : 24 Jun 2022 03:30 IST

వచ్చే జీఎస్‌టీ మండలి సమావేశంలో రాష్ట్రాలు పట్టుబట్టే అవకాశం

దిల్లీ: వచ్చే వారంలో జరగనున్న జీఎస్‌టీ మండలి సమావేశంలో జీఎస్‌టీ పరిహారాన్ని మరింత కాలం పొడిగించే అంశంపై ప్రతిపక్షాలు అధికారంలో రాష్ట్రాలు, కేంద్రం మధ్య వాడీవేడి చర్చ జరిగే అవకాశం కన్పిస్తోంది. జీఎస్‌టీ పరిహారం ఇవ్వడాన్ని కొనసాగించాల్సిందిగా రాష్ట్రాలు పట్టుబట్టే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. ఆదాయాలు తక్కువగా ఉన్నాయనే కారణాన్ని చూపించి.. పరిహారం ఇవ్వడాన్ని కొనసాగించడానికి కేంద్రం ఒప్పుకోకపోవచ్చని చెబుతున్నారు. 2017 జులై 1న జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత, రాష్ట్రాలకు కలిగే ఆదాయ నష్టాన్ని భర్తీ చేసేందుకు అయిదేళ్ల పాటు జీఎస్‌టీ పరిహారం ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ జులై 1తో అయిదేళ్లు పూర్తి కావొస్తున్నందున పరిహారం ఇవ్వడాన్ని ఆపేయనున్నట్లు జీఎస్‌టీ మండలి గత సమావేశానంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చండీగఢ్‌లో జూన్‌ 28-29 తేదీల్లో జరగనున్న జీఎస్‌టీ మండలి 47వ సమావేశంలో జీఎస్‌టీ పరిహారం, కేంద్ర, రాష్ట్రాల ఆదాయ పరిస్థితులపైనే ఎక్కువగా చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. జీఎస్‌టీ పరిహార నిధిలో లోటును భర్తీ చేసే నిమిత్తం కేంద్రం అప్పు తీసుకొచ్చి 2020-21లో రూ.1.1 లక్షల కోట్లు, 2021-22లో రూ.1.59 లక్షల కోట్లు రాష్ట్రాలకు విడుదల చేసింది. ‘గతేడాది పరిహార సెస్సు వసూళ్ల నుంచి కేంద్రం వడ్డీ కింద రూ.7,500 కోట్లు చెల్లించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.14,000 కోట్లు కట్టాలి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అసలు కట్టడాన్ని ప్రారంభించాలి. 2026 మార్చి వరకు ఇది కొనసాగుతుంద’ని ఓ అధికారి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని