పదవీ విరమణ చేసిన పైలట్లకు ఎయిరిండియా పునర్నియామక ఆఫర్లు

పదవీ విరమణ చేసిన పైలట్లను మళ్లీ నియమించుకోవడానికి టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా సిద్ధమైంది. 65 ఏళ్ల లోపు వారికి అయిదేళ్ల కాలానికి పునర్నియామక ఆఫర్లు ఇచ్చింది. దాదాపు 300 విమానాలను కొనుగోలు చేసేందుకు సంస్థ ప్రయత్నాలు

Published : 24 Jun 2022 03:30 IST

ముంబయి: పదవీ విరమణ చేసిన పైలట్లను మళ్లీ నియమించుకోవడానికి టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా సిద్ధమైంది. 65 ఏళ్ల లోపు వారికి అయిదేళ్ల కాలానికి పునర్నియామక ఆఫర్లు ఇచ్చింది. దాదాపు 300 విమానాలను కొనుగోలు చేసేందుకు సంస్థ ప్రయత్నాలు చేస్తోందని వార్తలొచ్చిన నేపథ్యంలో, కార్యకలాపాల నిర్వహణలో స్థిరత్వం తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. పైలట్లను కమాండర్‌లుగా పునర్నియమించుకోవడానికి చూస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. మూడేళ్ల క్రితం వరకు పదవీ విరమణ చేసిన వారికి ఈ అవకాశం ఇస్తోంది. ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకం తీసుకొచ్చిన సమయంలోనే, ఎయిరిండియా పైలట్లను మళ్లీ నియమించుకోవడానికి ఆఫర్లు ఇస్తుండటం గమనార్హం. విమానయాన సంస్థకు పైలట్లు చాలా కీలకం కాగా.. కేబిన్‌ సిబ్బంది, విమాన నిర్వహణ ఇంజినీర్లు వంటి ఇతర ఉద్యోగులతో పోలిస్తే పైలట్లకు అధిక వేతనం లభిస్తుంది. దేశీయ విమానయాన పరిశ్రమలో నైపుణ్యం కలిగిన పైలట్లకు కొరత ఉండటంతో, పదవీ విరమణ చేసిన వారివైపు ఎయిరిండియా చూస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని