మార్చి నాటికి ద్రవ్యోల్బణం అదుపులోకి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి (జనవరి- మార్చి) త్రైమాసికం నాటికి దేశంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం లక్ష్యిత 6% కంటే దిగువకు వస్తుందని  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌ మైఖేల్‌ దేబబ్రత పాత్ర అంచనా వేశారు. అందువల్ల ఇతర దేశాలతో

Published : 25 Jun 2022 03:16 IST

ద్రవ్య పరపతి చర్యల అవసరం పరిమితమే

ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ మైఖేల్‌ దేబబ్రత పాత్ర

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి (జనవరి- మార్చి) త్రైమాసికం నాటికి దేశంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం లక్ష్యిత 6% కంటే దిగువకు వస్తుందని  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌ మైఖేల్‌ దేబబ్రత పాత్ర అంచనా వేశారు. అందువల్ల ఇతర దేశాలతో పోల్చితే మనదేశంలో ద్రవ్య పరపతి విధాన చర్యలు పరిమితంగానే ఉంటాయని వివరించారు.‘భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ రాజకీయాల ప్రభావం’ అంశంపై పీహెచ్‌డీ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ నిర్వహించిన సదస్సులో డిప్యూటీ గవర్నర్‌ మాట్లాడారు. ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరుకుందనే సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆర్‌బీఐ చేపట్టిన ద్రవ్య పరపతి చర్యలతో ద్రవ్యోల్బణం మార్చి త్రైమాసికానికి లక్ష్యిత స్థాయికి దిగివస్తుందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇంకా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐ చర్యలు ఇందుకు వీలుకల్పిస్తాయని అన్నారు. ఆర్‌బీఐలో ద్రవ్య పరపతి విభాగానికి దేబబ్రత పాత్ర ఇన్‌ఛార్జిగా ఉన్నారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఫలిస్తున్నందున, ఇకపై ద్రవ్య పరపతి చర్యలు మరీ అధికంగా ఉండకపోవచ్చని డిప్యూటీ గవర్నర్‌ వివరించారు. రుతుపవనాలు అనుకూలిస్తే  ద్రవ్యోల్బణంపై యుద్ధంలో మనం గెలుస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని