పల్సర్‌ 250లో ఆల్‌ బ్లాక్‌ వేరియంట్‌

పల్సర్‌ 250 మోడల్‌లో ఆల్‌- బ్లాక్‌ వేరియంట్‌ను శుక్రవారం బజాజ్‌ ఆటో విడుదల చేసింది. డ్యుయల్‌ ఛానల్‌ ఏబీఎస్‌ (యాంటీ లాంక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌)తో దీనిని అందుబాటులోకి తెచ్చింది. పల్సర్‌ ఎన్‌250 (న్యాక్డ్‌ స్ట్రీట్‌ ఫైటర్‌), పల్సర్‌ ఎఫ్‌ 250 (సెమీ ఫెయిర్డ్‌ స్ట్రీట్‌ రేసర్‌)లు రూ

Published : 25 Jun 2022 03:16 IST

ధర రూ.1.50 లక్షల నుంచి

ముంబయి: పల్సర్‌ 250 మోడల్‌లో ఆల్‌- బ్లాక్‌ వేరియంట్‌ను శుక్రవారం బజాజ్‌ ఆటో విడుదల చేసింది. డ్యుయల్‌ ఛానల్‌ ఏబీఎస్‌ (యాంటీ లాంక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌)తో దీనిని అందుబాటులోకి తెచ్చింది. పల్సర్‌ ఎన్‌250 (న్యాక్డ్‌ స్ట్రీట్‌ ఫైటర్‌), పల్సర్‌ ఎఫ్‌ 250 (సెమీ ఫెయిర్డ్‌ స్ట్రీట్‌ రేసర్‌)లు రూ.1.50 లక్షల (ఎక్స్‌షోరూం, దిల్లీ) ధరలో లభ్యమవుతాయని కంపెనీ తెలిపింది. అయితే పల్సర్‌ 250 మోడల్‌లో సింగిల్‌ ఛానల్‌ ఏబీఎస్‌ వేరియంట్‌ బైకును ప్రస్తుత రంగుల్లోనే విక్రయించడాన్ని కొనసాగిస్తామని పేర్కొంది. ఈ బైక్‌ను విడుదల చేశాక 6 నెలల కంటే తక్కువ సమయంలోనే 10,000 బైకులను డెలివరీ చేశామని, బీఎస్‌-6 శకం ప్రారంభం అయ్యాక 250 సీసీ మోటార్‌సైకిల్‌ విభాగంలో ఇదో ఘనతగా కంపెనీ తెలిపింది. పల్సర్‌ 250 డ్యుయల్‌ ఛానల్‌ ఏబీఎస్‌ వేరియంట్‌ ముందు వైపు 300 ఎంఎం, వెనక వైపు 230 ఎంఎం డిస్క్‌ బ్రేకులు, వెడల్పైన టైరు డైమెన్షన్లను కలిగి ఉందని, స్లిప్‌ అవ్వకుండా ఇవి రక్షణ కలిపిస్తాయని బజాజ్‌ ఆటో వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని