చిన్న వ్యాపారులకు ఓయో హోటళ్లలో 60% రాయితీ

ఓయో సభ్యత్వం ఉన్న హోటళ్లలో చిన్న వ్యాపారులు గది అద్దెకు తీసుకుంటే, అద్దెలో 60 శాతం తగ్గింపు లభించనుంది. జూన్‌ 27 నుంచి జులై 3 వరకు ఈ తగ్గింపు పొందొచ్చని ఓయో తెలిపింది. ప్రపంచ ఎంఎస్‌ఎమ్‌ఈ (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల) రోజు సందర్భంగా ఈ

Published : 25 Jun 2022 03:16 IST

దిల్లీ: ఓయో సభ్యత్వం ఉన్న హోటళ్లలో చిన్న వ్యాపారులు గది అద్దెకు తీసుకుంటే, అద్దెలో 60 శాతం తగ్గింపు లభించనుంది. జూన్‌ 27 నుంచి జులై 3 వరకు ఈ తగ్గింపు పొందొచ్చని ఓయో తెలిపింది. ప్రపంచ ఎంఎస్‌ఎమ్‌ఈ (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల) రోజు సందర్భంగా ఈ ఆఫర్‌ను ప్రకటించినట్లు వివరించింది. ఎంఎస్‌ఎమ్‌ఈ రంగంలోని వ్యాపార పర్యాటకులు ఈ తగ్గింపు పొందేందుకు అర్హులని వివరించింది. దేశవ్యాప్తంగా ఉనన సుమారు 2,000 ఓయో హోటళ్లలో 10,000కి పైగా గదుల నుంచి ఎంపిక చేసుకునే అవకాశం వారికి ఉందని పేర్కొంది. ఓయో యాప్‌, వెబ్‌సైట్‌, ఆన్‌లైన్‌ పర్యాటక ప్లాట్‌ఫామ్‌ ద్వారా బుక్‌ చేసుకుని, ఈ ఆఫర్‌ పొందొచ్చని ఓయో తెలిపింది. చెక్‌-ఇన్‌ సమయంలో బిజినెస్‌ కార్డును వాళ్లు చూపించాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని