టయోటా ప్లాంటులో సుజుకీ ఎస్‌యూవీల ఉత్పత్తి

జపాన్‌ వాహన దిగ్గజాలు టయోటా, సుజుకీలు తమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోనున్నాయి. ఇందులో భాగంగా సుజుకీ అభివృద్ధి చేసిన కొత్త ఎస్‌యూవీ ఉత్పత్తిని టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌(టీకేఎమ్‌)లో ఆగస్టు నుంచి తయారు చేస్తారు.

Published : 25 Jun 2022 03:16 IST

ఆగస్టు నుంచి ప్రారంభం

దిల్లీ: జపాన్‌ వాహన దిగ్గజాలు టయోటా, సుజుకీలు తమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోనున్నాయి. ఇందులో భాగంగా సుజుకీ అభివృద్ధి చేసిన కొత్త ఎస్‌యూవీ ఉత్పత్తిని టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌(టీకేఎమ్‌)లో ఆగస్టు నుంచి తయారు చేస్తారు. భారత్‌లో ఈ కొత్త మోడల్‌ను సుజుకీ భారత విభాగమైన మారుతీ సుజుకీ ఇండియా, టీకేఎమ్‌లు సుజుకీ, టయోటా మోడళ్లుగా మార్కెట్‌ చేయనున్నాయి. ఆఫ్రికా వంటి మార్కెట్లకూ కొత్త మోడల్‌ను ఎగుమతి చేయనున్నారు. ‘భారత్‌లో దీర్ఘకాలం పాటు పనిచేస్తున్న సుజుకీతో కలిసి కొత్త ఎస్‌యూవీని ప్రకటించడానికి సంతోషిస్తున్నామ’ని టయోటా ప్రెసిడెంట్‌ అకియో టయోడా పేర్కొన్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. టయోటాతో భాగస్వామ్యాన్ని కొనసాగించడం ద్వారా కొత్త వ్యాపారావకాశాలను పరిశీలిస్తామని సుజుకీ ప్రెసిడెంట్‌ తొషిహిరో సుజుకీ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని