సంక్షిప్త వార్తలు
సువెన్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ రైట్స్ ఇష్యూ ద్వారా రూ.400 కోట్లు సమీకరించాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను బోర్డు డైరెక్టర్ల సమావేశం ఆమోదించింది. రైట్స్ ఇష్యూ విధివిధానాలు, నిష్పత్తి, సంబంధిత ఇతర అంశాలను త్వరలో ఖరారు చేస్తారు.
సువెన్ లైఫ్ సైన్సెస్రూ.400 కోట్ల రైట్స్ ఇష్యూ
ఈనాడు, హైదరాబాద్: సువెన్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ రైట్స్ ఇష్యూ ద్వారా రూ.400 కోట్లు సమీకరించాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను బోర్డు డైరెక్టర్ల సమావేశం ఆమోదించింది. రైట్స్ ఇష్యూ విధివిధానాలు, నిష్పత్తి, సంబంధిత ఇతర అంశాలను త్వరలో ఖరారు చేస్తారు. ప్రస్తుతం సువెన్ లైఫ్ సైన్సెస్ అధీకృత మూలధనం రూ.20 కోట్లు (ఒక్కొక్కటీ రూ.1 ముఖ విలువ గల 20 కోట్ల షేర్లు, జారీ మూలధనం రూ.14.53 కోట్లు ఉన్నాయి. రైట్స్ ఇష్యూ చేపట్టడానికి వీలుగా అధీకృత మూలధనాన్ని రూ.30 కోట్లకు పెంచాలని కంపెనీ యాజమాన్యం ప్రతిపాదించింది.
75,000 మంది డెలివరీ భాగస్వాముల నియామకాలు: షాడోఫ్యాక్స్
ముంబయి: థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ సేవలందించే షాడోఫ్యాక్స్ టెక్నాలజీ జులై కల్లా 75,000 మంది డెలివరీ భాగస్వాములను నియమించుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. డెలివరీ నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ నియామకాలు చేపట్టనుంది. డెలివరీ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లలేనప్పటికీ, ఈ వృత్తిలో డబ్బులు సంపాదించాలనుకునే వారిని నియమించుకుంటామని సంస్థ తెలిపింది. ఇంతకు ముందు తమిళనాడులో 5000 డెలివరీ భాగస్వాముల ఉద్యోగాలను సృష్టిస్తామని షాడోఫ్యాక్స్ ప్రకటించింది. డెలివరీ ఉద్యోగులు నెలకు రూ.35,000 వరకు ఆర్జించొచ్చని, రూ.7.5 లక్షల విలువైన ఉచిత ఆరోగ్య బీమా సదుపాయాలు ఉంటాయని వివరించింది. అనుకూల పని సమయాలు, కనీస వేతన హామీ ఉంటుందని పేర్కొంది.
డాక్టర్ రెడ్డీస్‌కు ఎటాన్ ఫార్మా ఇంజెక్టబుల్ ఔషధాలు
ఈనాడు, హైదరాబాద్: అమెరికాలోని ఇలినాయిస్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎటాన్ ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన కొన్ని ఇంజెక్టబుల్ ఔషధాలు, బ్రాండ్లను డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ కొనుగోలు చేసింది. దీనికి ప్రతిఫలంగా ఎటాన్ ఫార్మాకు డాక్టర్ రెడ్డీస్ ప్రస్తుతం 5 మిలియన్ డాలర్ల నగదు చెల్లిస్తుంది. తదుపరి దశల వారీగా 45 మి. డాలర్ల వరకు చెల్లించే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద 50 మి. డాలర్ల వరకు ఎటాన్ ఫార్మాకు అందజేయాల్సి ఉంటుంది. డాక్టర్ రెడ్డీస్ కొనుగోలు చేస్తున్న ఔషధాల్లో బయార్ఫెన్ (ఫెనలిఫ్రిన్ హైడ్రోక్లోరైడ్) ఇంజెక్షన్, రేజిప్రెస్ (ఎఫిడ్రిన్ హైడ్రోక్లోరైడ్) ఇంజెక్షన్, ఏఎన్‌డీఏ అనుమతి ఉన్న సిస్టైన్ హైడ్రోక్లోరైడ్ ఉన్నాయి. ఈ ఔషధాలు తన చేతికి వచ్చినందున అమెరికాలో ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంటుందని డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సీఈఓ (ఉత్తర అమెరికా జనరిక్స్ విభాగం) మార్క్ కికుచి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్‌పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్