Published : 26 Jun 2022 03:38 IST

ఫాస్టాగ్‌పై ఆ వీడియో నిరాధారం

పీ2పీ లావాదేవీలు చేయడం కుదరదు: ఎన్‌పీసీఐ

దిల్లీ: సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుత్నుట్లు ఫాస్టాగ్‌తో వ్యక్తి నుంచి వ్యక్తికి (పీ2పీ) లావాదేవీలు చేయడం కుదరదని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) ట్విటర్‌ ద్వారా వివరణ ఇచ్చింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వీడియో నిరాధారమైందని పేర్కొంది. ఎన్‌పీసీఐ తీసుకొచ్చిన నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌ (ఎన్‌ఈటీసీ) ప్రకారం.. ఫాస్టాగ్‌ చెల్లింపులు సురక్షితం. ఫాస్టాగ్‌ లావాదేవీలు పూర్తిగా నమోదిత మర్చంట్లు మాత్రమే స్కాన్‌ చేయడానికి వీలవుతుంది. వారు మినహాయించి ఎవరు స్కాన్‌ చేసినా ఆ బార్‌ కోడ్‌లు పని చేయవని వివరణ ఇచ్చింది.
ఇంతకీ ఏం జరిగింది?: ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వీడియోలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఓ బాలుడు ఫాస్టాగ్‌ స్టిక్కర్‌ అంటించి ఉన్న కారు అద్దాలు తుడిచేందుకు ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో అతని చేతికి ఉన్న వాచ్‌ను.. ఆ ఫాస్టాగ్‌ స్టిక్కర్‌ మీద ట్యాప్‌ చేసేందుకు చూస్తాడు. దీంతో అనుమానం వచ్చిన కారులోని ప్రయాణికుడు సదరు బాలుడ్ని దగ్గరికి పిలిచి ఏం చేస్తున్నావ్‌? ఫాస్టాగ్‌ స్టిక్కర్‌ మీద ఎందుకు వాచ్‌తో ట్యాప్‌ చేస్తున్నావు? అని అడిగితే బాలుడు సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళతాడు. ఆ బాలుడిని పట్టుకునేందుకు కారులో ఉన్న ప్రయాణికుడు వెంబడిస్తాడు. కానీ ఆ బాలుడు తప్పించుకోవడంతో తిరిగి వచ్చిన ఆ వ్యక్తి ‘ఇదంతా ఫాస్టాగ్‌ స్కామ్‌. కారు అద్దాలు తుడుస్తూ స్మార్ట్‌వాచ్‌తో ఫాస్టాగ్‌ ద్వారా డ్రైవర్లు, యజమానుల డబ్బుల్ని కాజేస్తున్నార’ని ఆరోపిస్తాడు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని