ఎన్‌బీఎఫ్‌సీలు అప్రమత్తంగా ఉండాలి

బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు) రుణాలు అందించే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, అన్ని రంగాలకు రుణాలు ఇవ్వడం ద్వారా నష్ట భయాన్ని తగ్గించుకున్నట్లు అవుతుందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మాజీ ఛైర్మన్‌ రజనీశ్‌

Published : 26 Jun 2022 03:38 IST

ఎస్‌బీఐ మాజీ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌

కోల్‌కతా: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు) రుణాలు అందించే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, అన్ని రంగాలకు రుణాలు ఇవ్వడం ద్వారా నష్ట భయాన్ని తగ్గించుకున్నట్లు అవుతుందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మాజీ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ వెల్లడించారు. సూక్ష్మ రుణ సంస్థ వీఎఫ్‌ఎస్‌ క్యాపిటల్‌ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రజనీశ్‌ మాట్లాడుతూ ఎన్‌బీఎఫ్‌సీలు మూలధన నిష్పత్తి నిబంధనలు పాటించడంతో పాటు కోర్‌ బ్యాంకింగ్‌ సొల్యూషన్లను పరిచయం చేయాలని సూచించారు. బ్యాంకుల కంటే అధికంగా రిస్కు తీసుకునే సామర్థ్యం ఎన్‌బీఎఫ్‌సీలకే ఉంటుందని తెలిపారు. నష్ట భయం నిర్వహణ, కార్పొరేట్‌ పాలన.. కచ్చితంగా పాటించడంతో రుణదాతలు ఎన్‌పీఏల సమస్యను అధిగమించవచ్చని సలహా ఇచ్చారు. ఆర్థిక రంగంలో ఎన్‌బీఎఫ్‌సీల ద్వారా 23 శాతం రుణాలు మంజూరవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎన్‌పీఏల సంక్షోభం ఎప్పటికీ ఉండేదేనని తెలిపారు. విద్యుత్‌, బొగ్గు, టెలికాం, రహదారుల రంగాల్లో ప్రభుత్వ విధానాలూ ఇందుకు కారణమని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని