Netflix: నెట్‌ఫ్లిక్స్‌ ఇక చౌక!

ఓటీటీల్లో నెట్‌ఫ్లిక్స్‌ కథే వేరు. అన్నిటికి కంటే అదే ఎక్కువ ధరల్లో ప్లాన్లను అమలు చేస్తోంది. దీంతో కొంత మందికి దూరమైంది. ఇపుడు అందరికీ చేరువ కావడం కోసం వ్యాపార ప్రకటనలతో కూడిన ఒక చౌక ప్లాన్‌ను తీసుకురావడంపై పనిచేస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ సహ-సీఈఓ

Updated : 26 Jun 2022 17:14 IST

ఓటీటీల్లో నెట్‌ఫ్లిక్స్‌ కథే వేరు. అన్నిటికి కంటే అదే ఎక్కువ ధరల్లో ప్లాన్లను అమలు చేస్తోంది. దీంతో కొంత మందికి దూరమైంది. ఇపుడు అందరికీ చేరువ కావడం కోసం వ్యాపార ప్రకటనలతో కూడిన ఒక చౌక ప్లాన్‌ను తీసుకురావడంపై పనిచేస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ సహ-సీఈఓ టెడ్‌ సారండోస్‌ ధ్రువీకరించారని ఒక ఆంగ్ల వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది. ఈ కథనం ప్రకారం.. ఈ ప్లాన్‌ ద్వారా వినియోగదార్ల సంఖ్యను భారీగా పెంచుకోవాలని భావిస్తోంది. ‘నాకు నెట్‌ఫ్లిక్స్‌ చాలా ప్రియంగా అనిపిస్తోంది. వ్యాపార ప్రకటనలు వచ్చినా నేను పెద్దగా పట్టించుకోను. ధర తక్కువగా ఉండాలి’ అనే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోందని.. వీరినీ ఆకట్టుకోవడం కోసం ఒక యాడ్‌ టైర్‌(ప్రకటనలతో కూడిన ప్లాన్‌)ను జత చేయనున్నామని టెడ్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 2 లక్షల మంది వినియోగదార్ల సంఖ్య తగ్గిందని ఏప్రిల్‌లో కంపెనీ తెలిపింది. ఈ ధోరణి మధ్య నెట్‌ఫ్లిక్స్‌ షేర్లు సైతం 30 శాతం తగ్గాయి. రెండో త్రైమాసికం చివరకు 20 లక్షల మంది వినియోగదార్లను కోల్పోవచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. కాగా, ఈ చౌక ప్లాన్‌ను ఎలా తీసుకురావాలన్నదానిపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని