కేరళలో టాటా పవర్‌ అతి పెద్ద ఫ్లోటింగ్‌ సౌర విద్యుత్‌ ప్రాజెక్టు

టాటా పవర్‌కు చెందిన అనుబంధ సంస్థ టాటా పవర్‌ సోలార్‌ సిస్టమ్స్‌ దేశంలోనే అతి పెద్ద ఫ్లోటింగ్‌ సౌర విద్యుత్‌ ప్రాజెక్టును ప్రారంభించినట్లు తెలిపింది. 101.6 మెగావాట్ల గరిష్ఠ (ఎండబ్ల్యూపీ) సామర్థ్యంతో కేరళ బ్యాక్‌వాటర్స్‌లో దీన్ని నెలకొల్పినట్లు పేర్కొంది.

Published : 26 Jun 2022 03:38 IST

దిల్లీ: టాటా పవర్‌కు చెందిన అనుబంధ సంస్థ టాటా పవర్‌ సోలార్‌ సిస్టమ్స్‌ దేశంలోనే అతి పెద్ద ఫ్లోటింగ్‌ సౌర విద్యుత్‌ ప్రాజెక్టును ప్రారంభించినట్లు తెలిపింది. 101.6 మెగావాట్ల గరిష్ఠ (ఎండబ్ల్యూపీ) సామర్థ్యంతో కేరళ బ్యాక్‌వాటర్స్‌లో దీన్ని నెలకొల్పినట్లు పేర్కొంది. కాయమ్‌కులమ్‌లోని వాటర్‌బాడీలో 350 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును స్థాపించినట్లు కంపెనీ వెల్లడించింది. నీటి లోతు ఎక్కువగా ఉండటం, పెద్ద పెద్ద అలలు, నీటి లవణీయత ఆందోళనలు ఉన్నా అనుకున్న సమయానికి ఇన్‌స్టలేషన్‌ పూర్తి చేయగలిగామని వివరించింది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పంద విభాగంలో తొలి ఫ్లోటింగ్‌ సోలార్‌ ఫొటోవోల్టాయిక్‌ (ఎఫ్‌ఎస్‌పీవీ) ప్రాజెక్టు ఇదేనని టాటా పవర్‌ సీఈఓ, ఎండీ ప్రవీర్‌ సిన్హా వెల్లడించారు. ఈ ఒప్పందంలో భాగంగా ఈ ప్లాంట్‌ నుంచి ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్‌ కేరళ రాష్ట్ర విద్యుత్‌ బోర్డు (కేఎస్‌ఈబీ) తీసుకుంటుందని పేర్కొన్నారు. 2030 నాటికి ప్రభుత్వం విధించుకున్న 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యంలో భాగంగా టాటా పవర్‌ సోలార్‌ అడుగులు వేస్తోందని టాటా పవర్‌ రెన్యువబుల్స్‌ ప్రెసిడెంట్‌ ఆశిష్‌ ఖన్నా వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని