మైహోంకు అంతర్జాతీయ భద్రతా అవార్డులు

మైహోం కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రెండు ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ భద్రతా అవార్డులను అందుకుంది. యూకేలోని బ్రిటిష్‌ సేఫ్టీ కౌన్సిల్‌, యూఎస్‌ఏలోని వరల్డ్‌ సేఫ్టీ ఫోరం నుంచి నిర్మాణ విభాగంలో ఇంటర్నేషనల్‌ సేఫ్టీ అవార్డులను అందుకుంది. పని ప్రదేశంలో

Published : 26 Jun 2022 03:38 IST

ఈనాడు, హైదరాబాద్‌: మైహోం కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రెండు ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ భద్రతా అవార్డులను అందుకుంది. యూకేలోని బ్రిటిష్‌ సేఫ్టీ కౌన్సిల్‌, యూఎస్‌ఏలోని వరల్డ్‌ సేఫ్టీ ఫోరం నుంచి నిర్మాణ విభాగంలో ఇంటర్నేషనల్‌ సేఫ్టీ అవార్డులను అందుకుంది. పని ప్రదేశంలో ప్రమాదాలు జరగకుండా చేపట్టిన చర్యలు, కార్మికుల శ్రేయస్సు, కొవిడ్‌ సమయంలో తీసుకున్న జాగ్రత్తలతో పాటు పలు అంశాలను పరిశీలించి 2021 సంవత్సరానికి ఈ అవార్డులను ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయి భద్రతా ప్రమాణాలు పాటిస్తూ.. అవార్డులు సాధించడంలో అంకిత భావంతో పనిచేసిన సంస్థ భద్రతా విభాగాధిపతి డీబీవీ ఎస్‌ఎన్‌ రాజు నేతృత్వంలోని బృందాన్ని, ప్రాజెక్ట్స్‌ సీనియర్‌ ప్రెసిడెంట్‌ ఎంకేఆర్‌ సాయిని మైహోం ఛైర్మన్‌ జూపల్లి రామేశ్వర్‌రావు అభినందించారు. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా మైహోం కోసం పనిచేస్తున్న గుత్తేదారులకు అవార్డులో భాగస్వామ్యం ఉందని వైస్‌ ఛైర్మన్‌ జె.రామురావు అన్నారు.


ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వడ్డీ చెల్లింపులో మళ్లీ విఫలం

దిల్లీ: మార్పిడి రహిత డిబెంచర్ల (ఎన్‌సీడీ)కు సంబంధించి రూ.4.10 కోట్ల వడ్డీ చెల్లింపులో ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ విఫలమయ్యింది. వడ్డీ చెల్లింపునకు చివరి తేదీ 2022, జూన్‌ 24 అని ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో తెలిపింది. ఫ్యూచర్‌ గ్రూపు జూన్‌లో ఇప్పటివరకు నాలుగు సార్లు చెల్లింపుల్లో విఫలమైంది. ఈవారం ప్రారంభంలో ఎన్‌సీడీలపై రూ.85.71 లక్షలు, రూ.6.07 కోట్ల వడ్డీని చెల్లించలేకపోయింది. అలాగే ఈ నెల ప్రారంభంలోనూ రూ.1.41 కోట్ల వడ్డీని కట్టలేదు. తాజాగా రూ.40 కోట్లకు జారీ చేసిన సెక్యూరిటీస్‌పై వడ్డీని చెల్లించలేకపోయినట్లు కంపెనీ తెలిపింది. 2021 జూన్‌ 24 నుంచి 2022 జూన్‌ 23 మధ్య కాలానికి ఈ వడ్డీ చెల్లింపును కంపెనీ చేయలేకపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని