రాగి తయారీలోకి అదానీ

రాగి తయారీ వ్యాపారంలోకి గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌ అడుగుపెట్టనుంది. గుజరాత్‌లోని ముంద్రాలో 10 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యం కలిగిన రాగి రిఫైనరీ ప్లాంట్‌ను రెండు దశల్లో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ అనుబంధ

Published : 27 Jun 2022 03:24 IST

రూ.6071 కోట్ల బ్యాంకు రుణాలు

దిల్లీ: రాగి తయారీ వ్యాపారంలోకి గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌ అడుగుపెట్టనుంది. గుజరాత్‌లోని ముంద్రాలో 10 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యం కలిగిన రాగి రిఫైనరీ ప్లాంట్‌ను రెండు దశల్లో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ అనుబంధ సంస్థ కచ్‌ కాపర్‌ నెలకొల్పనుంది. కచ్‌ కాపర్‌ మొదటి దశకు ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం రూ.6,071 కోట్ల మేర రుణాలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుంది. బ్యాంకుల కన్సార్షియంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్‌, ఎగ్జిమ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఉన్నాయి. ఈ ప్లాంట్‌ మొదటి దశ ఉత్పత్తి సామర్థ్యం 5 లక్షల టన్నులని కంపెనీ తెలిపింది. 2023-24 తొలి అర్ధభాగంలో ఈ ప్లాంటులో తయారీ ప్రారంభించాలనే లక్ష్యంతో నిర్మాణ పనులు చేపడుతున్నట్లు అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ డైరెక్టర్‌ వినయ్‌ ప్రకాశ్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని